అంటారు కానీ..రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరూ..శాశ్వత మిత్రులు ఉండరు.. ప్ర‌స్తుతం ఉప్పు-నిప్పు మాదిర‌గా ఉన్న వైసీపీ-జ‌న‌సేన పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌నున్నాయా?  కీల‌క‌మైన ఎన్నిక‌ల‌ను క‌లిసే క‌సిగా ఎదుర్కొన‌నున్నాయా? అంటే.. తాజాగా స్పందించిన తిరుప‌తి మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ వ్యాఖ్య ల‌ను బ‌ట్టి ఔన‌నే చెప్పాలి. అంతేకాదు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజన్‌ ఉన్న నాయకుడని  కితాబిచ్చారు. త్వరలోనే జనసేన, వైసీపీ కలుస్తాయని చెప్పారు. ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేస్తాయని పునరుద్ఘాటించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి తాను తిరుపతి ఎంపీగా పోటీ చేశానని, అప్పుడు పవన్‌ను దగ్గరగా గమనించానని, సమాజం పట్ల ఆయనలో బాధ్యత కనిపిస్తోందని తెలిపారు.  


వైసీపీలో విశ్వాసంగా పనిచేస్తున్నానని, ఈసారి కూడా తిరుపతి నుంచి పోటీకి తనకే అవకాశం రావచ్చని అభిప్రాయపడ్డారు. మ‌రి ఈయ‌న ఇలా చెబుతుంటే.. వైసీపీ కేడ‌ర్‌కానీ, జ‌న‌సేన నాయ‌కులు కానీ దీనిని ఖండించ‌నూలేదు.. మ‌ద్ద‌తివ్వ‌నూ లేదు! దీనిని బ‌ట్టి రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.. అన్న‌దానికి ఈ వ్యాఖ్య‌లే ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు. నిజానికి ఆది నుంచి కూడా ప‌వ‌న్ .. జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూనే ఉన్నాడు. సీఎం సీటు కోసం ప్ర‌త్యేకంగా ఆయ‌న పార్టీ పెట్టుకున్నారు. సీఎం కొడుకుని సీఎంను చేయాలా? అని పెద్ద ఎత్తున ప్ర‌శ్నించారు. ఇక‌, అనుభ‌వం తాలూకు లెక్క‌లు కూడా పేర్కొన్నా రు. 


జ‌గ‌న్‌కు అనుభ‌వం లేద‌ని, అందుకే తాను విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని భావించి చంద్ర‌బాబుకు మద్ద‌తిచ్చాన‌ని చెప్పారు. మ‌రి ఈవ్యాఖ్య‌ల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌గానే.. జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ వివాహాలకు సంబంధించిన వ్య‌క్తిగత విష‌యాల‌ను తెర‌మీదికి తెచ్చారు. దీంతో ఇక్క‌సారిగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల‌జ‌డి రేగింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. నిజానికి చంద్ర‌బాబుతో తెగ‌తెంపులు చేసుకున్న ప‌వ‌న్‌.. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు రెడీ అయ్యార‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. 


అయితే, దీనిపై ఎలాంటి ప్ర‌తిపాద‌న వ‌చ్చిందో తెలియ‌దు కానీ.. ఇంత‌లోనే జ‌గ‌న్.. జ‌న‌సేనానిని తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శించ‌డం పెను విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ ఇప్పుడు ఈ మాజీ ఐఏఎస్ వ‌ర‌ప్ర‌సాద్  వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి తెర‌వెనుక ఏదో జ‌రుగుతోంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతోందో తెలియాలంటే.. కొన్నాళ్లు వెయిటింగ్ త‌ప్ప‌దు!! వ‌ర ప్ర‌సాద్ వ్యాఖ్య‌లే నిజ‌మైతే.. రాష్ట్రంలో సంచ‌నాల‌కు తెర‌దీసిన‌ట్టే!! 


మరింత సమాచారం తెలుసుకోండి: