ఏ పార్టీకైనా నాయకత్వం అతి ముఖ్యం. నాయకున్ని చేసే పార్టీలో అంతా  వెంట నడిచేది. జనాలకు సైతం ఆ నాయకుని తీరుపైనే ఫోకస్ ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట్ల జాతీయ పార్టీల నాయకత్వాలు అసలే వెల వెల బోతాయి. సమర్ధులు పగ్గాలు చేపట్టి ఆ లోటును భర్తీ చేయాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాలలోనే ఆ నాయకుల వైపు, జనాలూ, పార్టీ క్యాడర్ కూడా చూసే అవకాశం ఉంటుంది.


సీన్ రివర్స్ :


దీనికి భిన్నంగా ఏపీ బీజేపీ వ్యవహారం ఉంది. ఆ పార్టీ కి కొత్త పెత్తందారు గా వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణకు కేవలం నాలుగు నెలలకే మొహం మొత్తినట్లుందేమో. పార్టీ తీరు చూసి ఆయకే వెగటు పుట్టిందేమో. లేక జనాలలో ఆదరణ సరిగా లేదని వైరాగ్యం కలిగిందో. వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీనికి చెబుతున్న కారణాలు అంత నమ్మశక్యంగా లేవు.


పార్టీ కోసమేనట :


పార్టీ ప్రచారం కోసమే కన్నా పోటీకి దూరంగా ఉంటారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికలలో ఆయన ఎంపీ గా కానీ, ఎమ్మెల్యేగా కానీ పోటీకి దిగబోరని అంటున్నారు. అయితే దీనిపై వేరే విధంగా వ్యఖ్యానాలు వినవస్తున్నాయి. బీజేపీ కి ఏపీలో నూకలు చెల్లాయని, అందువల్లనే అధ్యక్షుడే పోటీకి దిగడానికి వేనకంజ వెస్తున్నారని వైరల్ అవుతోంది.  బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ తీరే ఇలా ఉంటే మిగిలిన వారి గురించి చెప్పనక్కరలేదు.


క్యాడర్ మాటేంటి :


ఓ పార్టీ అధ్యక్షుడు ఇలా కాడి వదిలేస్తే క్యాడర్ కి ఏ విధమైన నైతిక ధైర్యం ఉంటుందన్నది ఆలోచించాల్సిన విషయమే. మరో వైపు బీజేపీ ఏపీ పూర్వ అధ్యక్షుడు హరిబాబు కూడా పోటీకి నై అంటున్నట్లు భోగట్టా. ఈసారి ఎంపీగా విశాఖ నుంచి కొత్త వారికే చాన్స్ అన్నది పార్టీలో మాట. ఇది కూడా క్యాడర్ ఆత్మ విశ్వాశాన్ని దెబ్బ తీసే పరిణామమే. సీనియర్లు, పార్టీకి రధ సారధులు లాంటి వారే ఎన్నికలలో యుధ్ధానికి వీపు చూపిస్తే ఇక పార్టీకి ఎక్కడ ధైర్యం వస్తుందన్నది ప్రశ్న. అదే కనుక జరిగితే బీజేపీ ఎంపిక చేసుకున్న సీట్లలో కూడా నామ మాత్రపు పోటీ సైతం ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: