ఏపీలో అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు  లేరనేది వాస్తవం బాబు గారి తెలివితేటల ముందు కాకలు తీరిన యోధులు అయిన సరే మట్టి కరవాల్సిందే..ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో అయినా సరే ఎంతో ధైర్యంగా సమస్యలని ఎదుర్కునే సత్తాగల చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకేయాల్లో మాత్రమే కాదు జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు..బాబు సత్తా కూడా బీజేపీ కి బాగా తెలుసు అందుకే బాబు స్టామినా పెరగకుండా చంద్రబాబుని ఇబ్బందులకి గురిచేస్తూనే ఉన్నారు..

 Image result for chandrababu

అయితే కేంద్రం ఒక పక్క మోసం చేసినా తన వ్యూహాలతో చంద్రబాబు ముందుకు వెళ్తూనే బీజేపీ ని వ్యతిరేకిస్తున్న పార్టీలని ఐక్యం చేస్తూ చాపకింద నీరులా తన పని తానూ చేసుకుంటూ వెళ్తున్నారు..అంతేకాదు తనకి అందుబాటులో ఉన్న కీలకమైన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై జాతీయస్థాయిలో రాజకీయాల గురించి చర్చలు జరుగుపుతున్నారు..భవిష్యత్తులో జాతీయ స్థాయిలో టీడీపీ ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపై చంద్రబాబు ఎంతో లోతుగా సమాలోచనలు చేస్తున్నారని కూడా తెలుస్తోంది..

 Image result for modi

ఇదిలాఉంటే ఒక వేళ బీజేపీ ఓడిపోతేనే, ప్రత్యమ్నాయ పార్టీలు అధికారం చేపడితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని ఆ సమయంలోనే టీడీపీ పుంజుకోవాలని బాబు తన టీడీపీ నేతలకి దిశానిర్దేశం చేశారు.. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్..రాజస్థాన్..బీహార్...మహారాష్ట్ర...గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించింది కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయా రాష్ట్రాల్లోబీజేపీ కి ఘోరమైన పరాభవం తప్పదనేది విశ్లేషకుల అభిప్రాయం కూడా ఐతే దక్షిణ భారత దేశంలో కూడా బీజేపీ కి ఎదురుదెబ్బలు తగలనున్నాయిని అంటున్నారు విశ్లేషకులు వివిధ సర్వేలు, అంచనాల ప్రకారం 2019లో బీజేపీకి 120 నుంచి 150 సీట్ల వరకూ మాత్రమే వచ్చే అవకాశముందని టీడీపీ నేతలతో అన్నారు.

 Image result for chandrababu

అంతేకాదు చంద్రబాబు అన్ని ప్రాంతీయ పార్టీలని ఒకే తాటిపైకి తీసుకువచ్చి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది..అందుకే చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వాడులుకునేలా లేరని అంటున్నారు..ఇప్పటికే బీజేపీ కి చుక్కలు చూపించడానికి బాబు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని అంటున్నారు పార్టీ వర్గాలు..ఇప్పటికే బాబు అన్ని అస్త్రాలు సిద్దంగా ఉంచుకున్నాడని ఎన్నికల సమయంలో ఒక్కో అస్త్రం వదలడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది..అయితే తనపై శత్రువులు చేయబోయే  రాజకీయ దాడులని ముందుగానే పసిగట్టే “మోడీ, షా” బాబు వేస్తున్న అస్త్రాలని తుస్సుమనిపిస్తారా లేక ధైర్యంగా ఎదుర్కుంటారో వేచి చూడాల్సిందే..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: