వైసీపీ మాజీ ఎంపీ వర ప్రసాద్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. అధినేత జగన్ పొత్తుల విషయం లో ఒకటి చెబుతుంటే ఇతను మాత్రం దానికి పూర్తి విరుద్దంగా మాట్లాడతున్నాడు.  ఏదో ఒక‌టి మాట్లాడి ప్రచారం పొందాల‌నుకుంటున్నారా లేక ఎంత‌కైనా మంచిద‌ని జ‌న‌సేన పార్టీలో క‌ర్చీప్ వేసి ఉంచుదామ‌ని భావిస్తున్నారా అనే అనుమానాలు వైసీపీలో ఉన్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని కూడా ఆయ‌న నిన్న అన్నారు.

Image result for ycp mp varaprasad

రాబోవు సార్వత్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌ల‌సి పోటీ చేస్తామ‌ని ఆయ‌న ప్రక‌టించారు. ఒక‌వైపు పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ అంటే విరుచుకుప‌డుతున్నారు. ప‌వ‌న్ అనేమాట విన‌డానికి కూడా జ‌గ‌న్ ఆస‌క్తి చూప‌డంలేదు. ఇక జ‌న‌సేన‌తో పొత్తు అనే ప్రస‌క్తే లేద‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో జ‌గ‌న్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత అభిప్రాయం ఆ విధంగా ఉంటే... వ‌ర‌ప్రసాద్ అందుకు పూర్తి విరుద్ధంగా ప్రక‌ట‌న‌లు చేయ‌డం జ‌నానికి ఎలాంటి సందేశం, సందేహం పంపుతుందో ఆయ‌న ఆలోచిస్తున్నట్టుగా లేరు.


Image result for ycp mp varaprasad

వైసీపీలో విశ్వాసంగా ప‌నిచేస్తున్నాన‌ని, ఈ ద‌ఫా కూడా తిరుప‌తి నుంచి పోటీచేసే అవ‌కాశం త‌న‌కే ద‌క్కుతుంద‌నే విశ్వాసాన్ని వ‌ర‌ప్రసాద్ వ్యక్తం చేశారు. కాని ఆయ‌న‌కు ఏ మూలో త‌న‌కు టికెట్ రాద‌నే భ‌యం, అనుమానం వెంటాడుతున్నట్టు క‌నిపిస్తోంది. అందుకే త‌ర‌చూ పార్టీకి ప‌ర‌స్పరం విరుద్ధమైన అభిప్రాయాల‌ను వెల్లడిస్తూ వివాదాస్పదం అవుతున్నార‌ని వైసీపీ అగ్రనేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: