చంద్ర బాబు ఇప్పటివరకు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడో ఇప్పటివరకు లెక్కేలేదు. అయితే  టీడీపీ కి ఇప్పుడు మిత్రులు కరువైనారు 2014 లో టీడిపి వెంట ఉన్న జనసేన మరియు బీజేపీ ఇప్పడూ దూరం అయ్యింది ఎప్పుడు ఏ తోడు లేకుండా ఎన్నికల్లో వెళ్లే ధైర్యం బాబుకు లేదు కాబట్టి ఇప్పుడు కూడా మిత్రుల వేట కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంద‌నే వార్తా క‌థ‌నాల‌పై సీనియ‌ర్ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ ..అదే నిజ‌మైతే తాను బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడుతాన‌ని హెచ్చరించ‌డం గ‌మ‌నార్హం.

Image result for chandra babu

ఇప్పుడు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు నిజం కాబోతోంది. ఈ మార్పు టీడీపీ అధినేత‌, ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత‌ ప‌త‌నానికి పునాది అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చి రికార్డు సృష్టించారు. జాతీయ‌స్థాయిలో సైతం కాంగ్రెస్‌కు వ్యతిరేక కూట‌మి నేష‌న‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయ‌డంలో ఎన్టీఆర్ కీల‌కపాత్ర పోషించారు. నేష‌న‌ల్ ఫ్రంట్ చైర్మన్‌గా కూడా ఎన్టీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పారు.

Image result for chandra babu

అయితే ఇప్పడూ ఎన్‌డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కొచ్చిన త‌ర్వాత కాంగ్రెస్‌కు బాగా ద‌గ్గర‌వుతూ వ‌చ్చింది. త‌మ‌కు అనుకూలంగా ప‌రిస్థితుల‌ను టీడీపీ నేత‌లు తిప్పుకుంటూ వ‌స్తున్నారు. క‌ర్నాట‌క‌లో కుమార‌స్వామి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లడం, అక్కడ రాహుల్‌తో మాటామంతీ ఇద్దర్నీ ద‌గ్గర చేసింది. ఆ త‌ర్వాత మోడీ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మ‌ద్దతు, రాజ్యస‌భ‌లో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ వెన్నుద‌న్నుగా నిల‌వ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకుని బాబు త‌న కోరిక తీర్చుకోవ‌చ్చేమో గాని, అప్పుడే ఆయ‌న ప‌త‌నానికి కూడా బీజం ప‌డుతుంద‌న‌డంలో సందేహంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: