ఆమె ఆషామాషీ పెళ్ళి కూతురు కాదు. రాష్ట్రానికే నాయకురాలు. అటువంటి ఆమె పీటలు ఎక్కిన ఘట్టం అద్భుతంగా ఉండాల్సిందేగా. అందుకే భారీ బడ్జెట్ సినిమాను తలపించేలా ఏర్పాట్లు ఓ రేంజిలో జరుగుతున్నాయి మరి. జనం కూడా కధలుగా చెప్పుకునేటంతగా అంగ రంగ వైభవంగా ఆ పెళ్ళి జరుగుతోంది మరి. ఇంతకీ ఎవరామె, ఏమా కధా కమామీషూ ..


 మతి పోయే రేంజిలోనట :


మినిస్టర్ అఖిలప్రియ పెళ్ళి శుభలేఖలు ఎన్ని కొట్టించారు అనే కంటే లారీడు లోడు తెచ్చారు అనడమే బాగుంటుంది. అన్నేసి శుభలేఖలు ఖరీదైనవి వూరూ వాడా పంచుకుపోయే పని ఇపుడు జాం జాం గా జరుగుతోంది. అఖిలప్రియ ఈ నెల 29వ్ వరుడు భార్గవ్ ను పెళ్ళడబోతున్న సంగతి తెలిసిందే. పెళ్ళి కార్డ్ చూస్తే మతి పోయే రేంజ్లో ఉందట.


అందరికీ విందు :


లారీడు శుభలేఖలను మోసుకొచ్చి అఖిలమ్మ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో పంచుతున్నారుట. ప్రతి ఒక్కరు ఆ రోజున ఇంట్లో భొజనం చెయనక్కరలేదు. అందరికీ పెళ్ళి విందు బల్ పసంద్ గా ఉందంటున్నారు. ప్రతి గ్రామంలోనూ భోజనాలే భోజనాలు. ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగకూడదంతే మరి. ఇలా అతి ఆర్భాటంగా అఖిలప్రియ పెళ్ళి వేడుకలు జరుగుతుననాయి. ఇక ఆళ్ళగడ్డలోని భూమ ఇంజనీరింగ్ కాలేజ్ లో అఖిల వివాహం జరగనుంది.
అంటే పెళ్ళి రోజు, ముందు రోజూ, కూడా అక్కడ అందరికీ అన్నీ అందుతాయన్న మాట. మొత్తానికి సీమలోనే కాదు, ఏపీలోనూ అఖిలప్రియ పెళ్ళి కొన్నళ్ళపాటు మాట్లాడుకునేలా అదిరిపోయే రేంజిలో చేస్తున్నరట.


మరింత సమాచారం తెలుసుకోండి: