ఆమె అయిదేళ్ళ క్రితం రాజకీయాలకు బాగా కొత్త. తొలిసారి ఎన్నికలల్లో పోటీ చేయడం, లక్కీగా ఉద్దండులనే ఓడించి పార్లమెంట్ మెంబర్ అయిపోవడం అలా జరిగిపోయింది. నాలుగున్నరేళ్ళ రాజకీయంలో ఎన్నో మలుపులు చూసిన ఆమె అనుభవం బాగానే గడించారు. ఇపుడు కొత్త పార్టీ పెడతానంటున్నారు.


గీతా మార్చేస్తుందా :


విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిపోయారు. ఈ రోజు లాంచనంగా పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. పార్టీ లక్ష్యాలు, అజెండా వంటివి కూడా ప్రకటిస్తారని అంటున్నారు. ఆ పార్టీలో ఎవరెవరు ఉంటారో ఏమిటన్నది చూడాల్సి వుంది. ఇదిలా ఉంటే గీత తన అరకు ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ లోక్ సభ స్పేకర్ కు లేఖ పంపినట్లు సమాచారం.

అన్నీ చుట్టేశారుగా :


గీత వైసీపీ నుంచి తొలిసారి పోటీ చేసి అరకు  ఎంపీ పదవి చేపట్టారు. ఆ తరువాత వెంటనే అధికార తెలుగుదేశం వైపుగా వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అలా ఉన్న తరువాత చంద్రబాబుని కూడా విమర్శించడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. ఇక పార్లమెంట్లో  అవిశ్వాసం సందర్భంగా ప్రధాని మోడీని వెనకేసుకురావడంతో ఆమె బీజేపీలో చేరుతారని భావించారు. మరి ఏం జరిగిందో ఏమో ఇపుడు కొత్త పార్టీ అంటునారు.  


దాని విధి విధానాలు అవి చూసాక కానీ ఆమె రూట్ ఏంటన్నది చెప్పాల్సి ఉంది.ఏది ఏమైనా కేంద్ర మంత్రిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ రాజకీయవేత్త కిశోర్ చంద్రదేవ్ వంటి దిగ్గజాన్ని ఓడించి సంచలనం క్రియేట్ చేసిన గీత కొత్త పార్టీతో ఎలా  ముందుకు వెళ్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: