తెలంగాణ టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వీడిపోయినప్పుడు అందరూ ఆశ్చర్య పోయినారు. అయితే విచిత్రంగా రేవంత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ లోకి జంప్ అయినప్పుడు ఎవరు కూడా పెద్దగా విమర్శలు చేయలేదు . ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చంద్ర బాబు ను పొగిడి మరీ వెళ్లి పోయాడు. టీడీపీ నుంచి తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌లోకి వెళ్ళడం వెనుక పెద్ద కథే నడిచింది. చంద్రబాబే, రేవంత్‌ రెడ్డిని ముందుగా కాంగ్రెస్‌లోకి పంపారు.

Image result for revanth reddy

అందుకే, రేవంత్‌ రెడ్డి మీద టీడీపీ నేతలెవరూ ఘాటైన విమర్శలు చేయకుండా చంద్రబాబు 'రహస్య ఆదేశాలు' జారీ చేశారు. మామూలుగా ఎవరన్నా ఏదన్నా పార్టీని వీడితే, ఆ పార్టీపై బురద జల్లేస్తారు. రేవంత్‌ అలాంటివేమీ చేయలేదాయె. పైగా, చంద్రబాబు మీద ప్రశంసలు గుప్పించేశారు టీడీపీని వీడే క్రమంలో రేవంత్‌రెడ్డి.  ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి మొదటి నిందితుడైతే, ఆ వ్యవహారానికి 'స్కెచ్‌' వేసి, 'బ్రీఫింగ్‌' చేసింది చంద్రబాబే. రేవంత్‌ అంటే అంత నమ్మకం చంద్రబాబుకి.

Image result for revanth reddy and chandra babu

ఇక, ఇప్పుడు చంద్రబాబు - రేవంత్‌ రాజకీయంపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే, రేవంత్‌రెడ్డి మాత్రం ఇంకా 'ఓపెన్‌' అవడంలేదు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై క్లారిటీ రావాల్సి వుందని చెబుతున్నారాయన. టీడీపీకి, తెలంగాణలో బీజేపీతోపాటు టీఆర్‌ఎస్‌ శతృవులనే విషయమ్మీద ఓ స్పష్టత వచ్చిందనీ.. టీడీపీకి మిత్రులెవరన్నదానిపై ఇంకొన్ని రోజుల్లోనే స్పష్టత రాబోతోందనీ రేవంత్‌రెడ్డి సెలవిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: