ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఆయువు పట్టు లాంటిది అనకాపల్లి. అక్కడ రాజకీయం మారితే మొత్తం ఉత్తరాంధ్ర పైనే ఆ ప్రభావం  గట్టిగా  ఉంటుంది. ఎందరో ఉద్దండులు ఉత్తరాంధ్రలో మీటింగ్ పెడితే అనకాపల్లినే ఎంచుకునేవారు. ఇటీవలే దివంగతులైన వాజ్ పేయ్ నుంచి మొదలుపెడితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధి, అన్న నందమూరి, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా అందరికీ అనకాపల్లి రాజకీయం కావాల్సిందే. అక్కడే సభలు పెట్టి సత్తా చూపేవారు.


మొత్తెక్కిస్తుందా :


కొత్త జిల్లాల విషయంలో ఓ పాలసీ పెట్టుకున్న వైసీపీ తాము అధికారంలోకి వస్తే 13 జిల్లాను పాతిక చేస్తామని ఇంతకు ముందే వెల్లడించింది. ప్రతి లోక్ సభకు ఓ జిల్లా అంటూ తన విధానం స్పష్టం చేసింది. జగన్ పాదయాత్రలో క్రిష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కొత్త జిల్లాల ప్రకటన చేశారు. మళ్ళీ ఇపుడు ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఆయన మరో మోతెక్కించే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇది కచ్చితంగా గురి తప్పని బాణమై రాజకీయ లక్ష్యాన్ని చేధిస్తుందని వైసీపీ బలంగా నమ్ముతోంది.


జిల్లాగా అనకాపల్లి :


అనకాపల్లి అటు  వర్తక, వాణిజ్య కేంద్రమే కాదు, రాజకీయ బెల్లాన్ని కూడా వేడిగా మరిగిందే ప్రాంతం. అటువంటి అనకాపల్లి లో గాలి ఎటు తిరిగితే ఉత్తరాధ్ర అటు తిరుగుతుందని సెంటిమెంట్. దానికి ద్రుష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ అనకాపల్లిలో అదిరిపోయే మీటింగ్ కి ప్లాన్ చేశారు. ఈ నెల 27న జరిగే ఆ మీటింగ్ ఉత్తరాంధ్రలో వైసీపీ పవర్ ఏంటన్నది చూపించేలా ఉంటుందని టాక్. ఆ సభలోనే అనకాపల్లిని జిల్లాగా చేస్తామంటూ జగన్ బెల్లం తీపి లాంటి హామీ ఇవ్వబోతున్నారు.


టర్న్ అవుతుందా :


అనకాపల్లి ప్రజల చిరకాల కోరిక అది. తమ ప్రాంతాన్ని కేంద్రంగా చేస్తూ జిల్లాను ప్రకటించాలని ఎప్పటినుంచో కోరుతూ వస్తున్నారు. వైసీపీ అధినేత ఇక్కడి ప్రజల  మనసును చూరగొనేలా కొత్త జిల్లా ప్రకటన ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే అనకాపల్లిలో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత బాగా రాజుకుంది. దానిని మరింతగా ఎగదోసేందుకు జగన్ కొత్త జిల్లా హామీతో ముందుకు వస్తే మొత్తాం రాజకీయం కీలక మలుపు తీసుకోవడం ఖాయమని వైసీపీ ధీమాగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: