మొత్తానికి  నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు ప్ర‌ముఖ నేత‌లు వైసిపిలో చేర‌టానికి రంగం సిద్ద‌మైంది. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, బిజెపి నుండి సస్పెండ్ అయినా నేదురుమ‌ల్లి రామ‌కుమ‌ర్ రెడ్డి సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో చేర‌నున్నారు. ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌ప‌ట్నంలో పాద‌యాత్ర‌లో ఉన్న వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పాయి. 


సెప్టెంబ‌ర్ 2న ఆనం

Image result for anam ramanarayana reddy

వ‌చ్చే నెల 2వ తేదీన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైజాగ్ లో వైసిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు.  సెప్టెంబ‌ర్ 2వ తేదీన దివంగ‌త వైఎస్సార్ వ‌ర్ధంతి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అదే రోజు ఆనం వైసిపిలో చేర‌టానికి నిర్ణ‌యించుకున్నారు. అందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త‌ర్వాత మ‌రికొద్ది రోజుల్లోనే అంటే సెప్టెంబ‌ర్ రెండో వారంలోగానే నేదురుమ‌ల్లి కూడా ఉత్త‌రాంధ్ర వేదిక‌గానే వైసిపిలో  చేర‌నున్నారు. 


రెండో వారంలో నేదురుమ‌ల్లి 

Image result for nedurumalli ramkumar reddy

మొత్తానికి ఇద్ద‌రు ప్రముఖ నేత‌లు వైసిపిలో చేరుతుండ‌టంతో పార్టీ మ‌రింత  బ‌లోపేత‌మ‌వుతోంది.   అదే స‌మ‌యంలో 
ఇద్ద‌రు కూడా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ  చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇద్ద‌రు కూడా జ‌గ‌న్ తో భేటీ సంద‌ర్భంగా అదే విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు.  విచిత్ర‌మేమిటంటే ఇద్ద‌రికీ జ‌గ‌న్ ఏ విష‌యంలోనూ హామీ ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. ఒక‌వైపు ఎన్నిక‌లు త‌రుముకొచ్చేస్తున్న నేప‌ధ్యంలో ఆల‌స్యం చేస్తే న‌ష్టం వ‌స్తుంద‌న్న ఉద్దేశ్యంతోనే ఇద్ద‌రు కూడా ముందు పార్టీలో చేర‌టానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మ‌రి, టిక్కెట్టు ఎవ‌రికి వ‌స్తుందో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: