టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేయడం జరిగింది. ఆరువందల అబద్ధపు హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై అతి కొద్ది రోజులలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అయితే తన స్వార్థం కోసం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు తన పార్టీలో ఉన్న నాయకులను కూడా వదలలేదు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుత శాసన సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మోసం చేశారు అని ఆయన అనుచరులు,టీడీపీ నేతలు ఇటివల ఆరోపణలు చేశారు.

Image result for jagan

అయితే ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో మోదుగుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్ననియోజకవర్గం నుండి అయిన కానీ లేదా మాచర్ల నుండైన కానీ లేదా ఎంపీగా కానీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు పొలిటికల్ వర్గాలలో టాక్. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రస్తుతం ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కి తన సన్నిహితుల ద్వారా తెలియజేశారట...ఆక్షన్ మీరు ఇస్తే బాగుంటుందని జగన్కి సూచించారట.

Image result for modugula venugopala reddy

మరోపక్క తెలుగుదేశం పార్టీలో తాజాగా సీనియర్లకు టికెట్లు ఇచ్చేది లేదని బాబు తేల్చి చెప్పడంతో పార్టీలో ఉండటం కంటే వైసీపీలోకి పోవడం బెటరని మోదుగుల అనుచరులు, జిల్లా టీడీపీ నేతలు కూడా నచ్చచెప్పడంతో ఆయన పార్టీ మార్పుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు...అని ఆయన సన్నిహితుల దగ్గర వినిపిస్తున్న టాక్.

Related image

ఒకవేళ అన్నివిధాలా అన్ని పరిస్థితులు అనుకూలిస్తే కనుక జగన్ ఇచ్చాపురం లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు పొలిటికల్ వర్గాల నుండి వస్తున్న సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: