టీడీపీ కి ఇప్పుడు మిత్రులు కరువైనారు 2014 లో టీడిపి వెంట ఉన్న జనసేన మరియు బీజేపీ ఇప్పడూ దూరం అయ్యింది ఎప్పుడు ఏ తోడు లేకుండా ఎన్నికల్లో వెళ్లే ధైర్యం బాబుకు లేదు కాబట్టి ఇప్పుడు కూడా మిత్రుల వేట కొనసాగిస్తున్నాడు. అయితే.. తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయి... పతనమైపోయి ఉన్న తెలంగాణలో ఆయన ఎవరితో జట్టుకట్టబోతున్నారనే విషయాల గురించి  ఇప్పుడిప్పుడే లీకులు వస్తున్నాయి కాంగ్రెస్ తోనే పొత్తు అని..!

Image result for chandra babu and kcr

అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని తాజాగా కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రగతి భవన్లో జరిగిన కసరత్తు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు బాబుకి తలనొప్పిగా మారింది. ఎప్పుడూ ఎవరో ఒకరి మెడపై ఎక్కి స్వారీ చేసే బాబు ఈసారి కాంగ్రెస్ ని అడ్డంపెట్టుకుని ఎన్నికల గోదారి ఈదాలనుకుంటున్నారు. ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నాక ఓ పద్ధతి ప్రకారం హస్తం పార్టీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా లీకువీరుల్ని కూడా రంగంలోకి దించారు.

Image result for chandra babu and kcr

కేసీఆర్ కూడా కొన్నిరోజులుగా జమిలి ఎన్నికలు జరిగితే సరేసరి లేకపోతే తామే ముందస్తు ఎన్నికలకు వెళ్తామంటూ సిగ్నల్స్ ఇస్తూ వచ్చారు. సడన్ గా ఇప్పుడు స్టాండ్ మార్చుకున్నారు. దీంతో చంద్రబాబు ఇరుకునపడ్డారు. ఒకేసారి ఎన్నికలంటే తన ప్రయోగం రిజల్ట్ ఎలా ఉంటుందో బాబుకి తెలుసుకునే అవకాశంలేదు. అందులోనూ రెండు రాష్ట్రాల ఓటర్లను ఒకేలా చూడలేం. తెలంగాణలో కాంగ్రెస్ పై సానుభూతి, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండొచ్చు కానీ, ఏపీలో మాత్రం ఇంకా కాంగ్రెస్ ఐసీయూలోనే ఉంది. దీనితో తెలంగాణ లో కాంగ్రెస్ పొత్తు తో ఒక అంచనా కు వద్దామనుకున్న బాబుకు భంగపాటు తప్పలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: