మొత్తానికి చంద్ర‌బాబునాయుడు ఒంటెత్తు పోక‌డ‌ల‌పై  తెలుగుదేశంపార్టీలోనే తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డింది. ఇంత కాలం చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకున్నా  అడిగేవారు  లేరు.  చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాలు ఎవ‌రికైనా న‌చ్చ‌క‌పోయినా బాత్రూములో దూరి త‌మ‌లో తాము మాట్లాడుకోవాల్సిందే కానీ బ‌య‌ట‌కు చెప్పుకునే స్వేచ్చ కూడా టిడిపి నేత‌ల‌కు లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.  అటువంటిది మొద‌టిసారి అదికూడా బ‌హిరంగంగా చంద్ర‌బాబు ఆలోచ‌న‌కు వ్య‌తిరేక‌త బ‌య‌ట‌ప‌డింది. ఇది ఒక ర‌కంగా చంద్ర‌బాబుకు పెద్ద  షాక‌నే చెప్పాలి. 


కాంగ్రెస్ తో పొత్తుల‌పై చ‌ర్చ‌లు

Image result for congress and tdp

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎవ‌రితో పొత్తులు పెట్టుకోవాల‌నే విష‌యంలో  తెలుగుదేశంపార్టీ పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.  పొత్తులు పెట్టుకోవ‌టానికి కాంగ్రెస్ పార్టీ త‌ప్ప టిడిపికి ఇంకే పార్టీ మిగ‌ల‌లేదు. ఒంటిరిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే శ‌క్తి చంద్ర‌బాబుకు లేదు.  అంటే కాంగ్రెస్ తో పొత్తుకు తెలంగాణాతో లింకు ఉంది లేండి.   ఎందుకంటే, ఏపిలో కాంగ్రెస్ ప‌రిస్దితి ఎలాగుందో తెలంగాణాలో టిడిపి ప‌రిస్దితి సేమ్ డిటోయే. అంటే ఈ పొత్తు ఒక విధంగా చంద్ర‌బాబుకు నిర్భంద‌పు పొత్తు క్రిందే లెక్క‌.


రియాక్ష‌న్ గ‌మ‌నిస్తున్న చంద్ర‌బాబు 

Image result for chandrababu naidu

ఇటువంటి ప‌రిస్ధితుల్లో త‌న మ‌న‌సులోని మాట‌ను చంద్ర‌బాబు ఇత‌రుల నోటి ద్వారా చెప్పిస్తారు. ఇది చంద్ర‌బాబుకు మొద‌టి నుండి అల‌వాటైన విద్యే.  ఏ విష‌యమైనా కానీండి  తాను నేరుగా చెబితే ఎలాగుంటుందో అన్న ఆందోళ‌న వ‌ల్ల అదే విష‌యాన్ని ఇత‌రుల ద్వారా చెప్పించి రియాక్ష‌న్ ను గ‌మనిస్తారు.  రియాక్ష‌న్ పాజిటివ్ గా ఉంటే ఆ క్రెడిట్ ను త‌ర్వాత త‌న ఖాతాలో వేసుకుంటారు. ఒక‌వేళ రియాక్ష‌న్ నెగిటివ్ గా ఉంటే ఆ త‌ప్పును నేత‌ల‌పైకి నెట్టేస్తారు. 


చంద్ర‌బాబు ఆలోచ‌న‌కే ఓటేస్తున్న నేత‌లు

Image result for chandrababu review meeting

ఇపుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల‌న్న త‌న ఆలోచ‌న‌ను అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేత‌ల భేటీలో  వారి ముందుంచారు.  వారికి కూడా చంద్ర‌బాబు మ‌న‌సులోని మాటేంటో తెలుసుకాబ‌ట్టి చాలా మంది కాంగ్రెస్ తో పొత్తుంటేనే బాగుంటుంద‌ని చెప్పారు.  పార్టీలో ఏ నిర్ణ‌యం తీసుకున్నా అంద‌రితోనూ చ‌ర్చించే తీసుకుంటామ‌న్నంత బిల్డ‌ప్ ఇచ్చారు స‌మావేశంలో చంద్ర‌బాబు . ఇంకేముంది అదే విష‌యాన్ని టిడిపి మీడియా కూడా పొత్తుల‌పై చంద్ర‌బాబుకు అనుకూలంగా  ట‌ముకేయ‌టం మొద‌లుపెట్టింది.


ఎదురు తిరిగిన చింత‌కాయ‌ల‌


అంతా బాగానే ఉంద‌నుకుంటున్న స‌మ‌యంలో హ‌టాత్తుగా మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు పెద్ద బాంబేశారు. కాంగ్రెస్ తో పొత్తంటే  జ‌నాలు బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తారంటూ చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాంగ్రెస్ వ్య‌తిరేక‌తే పునాదిగా ఏర్ప‌డిన తెలుగుదేశంపార్టీ ఇపుడు అదే కాంగ్రెస్ తో పొత్తు ఎలా పెట్టుకుంటుంద‌ని చింత‌కాయ‌లు వేసిన ప్ర‌శ్న‌కు  అంద‌రూ ఒక్క‌సారి బిత్త‌ర‌పోయారు.  ఎన్టీఆర్ టిడిపి జెండా ప‌ట్టుకుని తిరిగింది కాంగ్రెస్ ను త‌రిమికొట్ట‌టానికే అన్న విష‌యాన్ని అయ్య‌న్న గుర్తు చేశారు.  ఇపుడు అదే కాంగ్రెస్-టిడిపిలు క‌లిస్తే ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని అంత‌క‌న్నా దుర్మార్గం ఇంకోటుందంటూ చింత‌కాయ‌లు మండిప‌డ్డారు. ఇక్క‌డ చింత‌కాల‌యు వేసిన ప్ర‌శ్న‌లు, చేసిన కామెంట్ల‌న్నీ చంద్ర‌బాబును ఉద్దేశించే అన్న‌ది ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే   బాహాటంగా కాంగ్రెస్ తో పొత్తును వ్య‌తిరేకించింది ఇప్ప‌టికి చింత‌కాయ‌ల మాత్ర‌మే. కానీ చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే వారు టిడిపిలో ఇంకెంత‌మందున్నారో ?  కాంగ్రెస్ తో పొత్తు విష‌యం చంద్ర‌బాబు అనుకున్నంత తేలిక్కాద‌ని మాత్రం అర్ధమ‌వుతోంది.   కాంగ్రెస్ తో పొత్తుపై  రోజులు గ‌డిచే కొద్దీ ఇంకెంత మంది నేత‌లు చింత‌కాయ‌ల‌తో గొంతు క‌లుపుతారో ? అపుడు చంద్ర‌బాబు ఏమి చేస్తారో  చూడాల్సిందే .  





మరింత సమాచారం తెలుసుకోండి: