విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాలు  మళ్ళీ వేడెక్కుతున్నాయి. ఇద్దరు మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో రానున్న రోజులలో ఈ మంట మరింత పెద్దది కాబోతోంది. ఇప్పటికే గంటా, అయ్యన్నల మధ్యన పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బాబు ఎలా సర్దుబాటు  చేస్తారో చూడాలి. 


వెనకేసుకువస్తున్న బాబు :


రెండు నెలల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ సర్వే విషయంలో కలత చెంది ఏకంగా పార్టీ నుంచే వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పట్లో బాబు అయనను శతవిధాలుగా బుజ్జగించి పార్టీలో మొత్తానికి ఉండేలా  చేసారు. ఆ తరువాత మారిన రాజకీయంలో బాబు గంటాకు మంచి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అంగ, అర్ధబలాలు పుష్కలంగా ఉండడంతో గంటాను వదులుకునేందుకు బాబు సిధ్ధంగా లేరు. 


హై హ్యాండ్ ఆయనదే  :


విశాఖ జిల్లా రాజకీయాలలో సీనియర్ మంత్రిగా అయ్యన్న ఉన్నా హై హ్యాండ్ మాత్రం గంటాదే అవుతోంది. గంటాకు జిల్లాలో ఎమ్మెల్యేల బలంతో పాటు ఏపీవ్యాప్తంగా తన సామాజికవర్గం ఎమ్మెల్యేలతో మంచి రిలేషన్లు ఉన్నాయి. డైనమిక్ లీడర్ గా ఉన్న గంటాను పక్కన పెడితే అసలుకే ఎసరు అన్నది తెలిసే టీడీపీ హై కమాండ్ ఆయనకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తోంది. గురువారం విశాఖలో జరిగిన జ్ణానభేరి ప్రోగ్రాం ని గంటా ఒంటి చేత్తో సక్సెస్ చేసి బాబు మెప్పు పొందారు.


ఫైర్ అవుతున్న అయ్యన్న :


విశాఖ సిటీలో దాదాపు నాలుగైదు గంటల పాటు సీఎం బాబు గడిపినప్పటికీ అయ్యన్న ఈ వైపుగా తొంగి చూడలేదు. గంటాకు పార్టీలో ఇంపార్టన్స్ పెరగడం, బాబు ఆయన వైపు మొగ్గు చూపడం వంటి పరిణామాలతో సీనియర్ మంత్రి రగిలిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపధ్యం నుంచే కాంగ్రెస్ తొ పొత్తులపై ఏకంగా బాబునే ఓ రేంజిలో అయ్యన్న కడిగిపారేశారు. అదే టైంలో గంటా సంస్థలకు మల్టీప్లెక్స్ లీజుకు ఇస్తే ఊరుకోబోనంటూ గట్టి  వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి చూడాలి అయ్యన్న ఆగ్రహం చల్లర్చడానికి బాబు ఏ మంత్రం వేస్తారో


మరింత సమాచారం తెలుసుకోండి: