ఓ వైపు అధికార పార్టీ ముందస్తు టిక్కెట్ల పేరుతో భారీ ఎత్తున కసరత్తు మొదలెట్టేసింది. అదీ ప్రత్యర్ధి పార్టీ ఉన్న సీట్లతోనే ప్రకటించి షాక్ ఇవ్వాలనుకుంటోంది నిజానికి అడ్వాన్స్ గా టిక్కెట్లు ఇవ్వడం  పవర్లో ఉన్న పార్టీకి ఏమంత మంచిది కాదు. ప్రతిపక్ష పార్టీ ఆలా జాగ్రత్త పడితే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. 


పార్టీకి జై అంటున్న జగన్ :


వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఇపుడు విశాఖ జిల్లాలో జోరుగా సాగుతోంది. రూరల్ జిల్లాలో జగన్ కు జనం నీరాజనం పడుతున్నారు. ఇప్పటికి రెండు పబ్లిక్ మీటింగులు పెడితే జనం పోటెత్తారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇలాకాలో రికార్డ్ స్థాయిలో జనం రావడం అధికార టీడీపీకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇక్కడ గంట పాటు ప్రసంగించిన జగన్ పార్టీని గెలిపించడని మాత్రేమే కోరారు, తప్ప క్యాండిడేట్ ని డిక్లేర్ చేయలేదు. అలాగే పాయకరావుపేట అసెంబ్లీ పర్ధిలోని కోట ఉన్రట్ల సభకూ జనం బాగానే వచ్చారు. ఇక్కడా జగన్ మా అభర్ధి ఫలానా అంటూ ఎవరి పేరూ ప్రకటించలేదు.


ఆశావహులలో టెన్షన్ :


జగన్ పాదయాత్రలో ఎక్కడికక్కడ క్యాండిడేట్లను డిసైడ్ చేస్తారని, ఇక తమకే టికెట్ కంఫర్మ్ అనుకుని ధీమాగా ఉన్న వారంతా ఇపుడు అధినేత వైఖరితో డీలా పడిపోయారు. నర్శీపట్నం నుంచి పెట్ల ఉమా శంకర్, పాయకరావుపేట నుంచి గొల్ల బాబూరావు టిక్కెట్లు గట్టిగా ఆశిస్తున్నారు ఓ వైపు వైసీపీకి జనంలో మంచి ఆదరణ ఉన్న వేళ అభ్యర్ధల పేర్లు జగన్ చెప్పకపోవడం వెనక స్ట్రాటజీ ఏంటన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.


ఇక్కడా ఇంతేనా :


ఇక మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు నియోజకవర్గం ఎలమంచిలిలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర సాగుతోంది. ఈ రోజు అక్కడ భారీ సభ ఉంది. ఇది కూడా టీడీపీకి కాక పుట్టించే రేంజిలో ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభలోనైనా కన్నబాబు పేరు ప్రకటిస్తారా అని ఆసక్తిగా చూస్తున్నారు. కన్నబాబు మాత్రం  ఈ విషయంలో  చాలా ధీమాగా ఉన్నారు.


గ్రూపుల వల్లనే :


నిజానికి జగన్ అభ్యర్ధులను ప్రకటించకుండా ఉండడానికి పార్టీలో గ్రూపుల గోల ప్రధాన కారణంగా చెబుతున్నారు. దానికి తోడు ఎన్నికలకు చాల టైం ఉండడంతో అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోవాలన్న వ్యూహం కూడా ఉందంటున్నారు. అదే విధంగా అధికార పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి వలసలు కూడా పెద్ద ఎత్తున ఉండొచ్చన్న ఆలోచనలు కూడా జగన్ క్యాండిడేట్లను ప్రకటించక పోవడానికి రీజన్ అంటున్నారు ఏది ఏమైన మౌనంగా ముందుకు సాగుతున్న జగన్ మనసులో ఏముందో నేతలు పసిగట్టలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: