వినాశకాలే విపరీత బుద్ది అంటారు పెద్దలు.  టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది దాని వల్ల ప్రయోజనాలు ఎంతో కానీ అవాంతరాలు మాత్రం విపరీతంగా వచ్చి పడుతున్నాయి.  ముఖ్యంగా కంప్యూటర్ వీడియో గేమ్స్ వీటి వల్ల పిల్లల సృజనాత్మకత మొత్తం కోల్పోతున్నారు.  వంద మంది పిల్లల్లో పట్టుమని పది మంది కూడా విజ్ఞానాన్ని ఆర్జించలేక పోతున్నారు..దానికి కారణం చాలా మంది పిల్లలు కంప్యూటర్ గేమ్స్ కి బాగా అలవాటు అవుతున్నారు.  అయితే ఇలాంటి వారితో కొంత మంది సైబర్ నేరగాళ్లు ఆడుకుంటున్నారు. 
Image result for momo challenge
ఆ మద్య ప్రపంచంలో బ్లూవేల్ గేమ్ తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.   ఇక బ్లూవెల్ గేమ్ కాస్త మర్చిపోయారు అంటున్న సమయంలోనే ‘మోమో’ గేమ్ అంటూ మరో దరిద్రం పట్టుకుంది. మోమో ఛాలెంజ్‌ అనేది ప్రపంచాన్ని భయపెడుతున్న ఆట... పిల్లల ప్రాణాలను తీస్తున్న ఆట..  ఈ మోమో ఛాలెంజ్‌ ఆనవాళ్ళు భారత్ లో కూడా బయటపడ్డాయి.    పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురికి చెందిన ఒక  కాలేజ్ విద్యార్థినికి వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లో ఈ గేమ్ ఉంది.  ఈ గేమ్ ను ఆడాలని మోమో ఛాలెంజ్‌ పంపించడమే కాకుండా, ఆ వ్యక్తి విద్యార్థినికి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆమె  పోలీసులను ఆశ్రయించింది.
Image result for momo challenge
దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసుల అది గుర్తు తెలియని ని వ్యక్తి నుండి వచ్చిన సందేశాన్ని చూపించి ఆ నెంబర్ ను పోలీసులకు ఇచ్చిన యువతి ఫిర్యాదుతో మోమో ఛాలెంజ్‌ మన దేశంలో కూడా ప్రవేశించిందని, అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Image result for momo challenge
ఈ ఛాలెంజ్ వల్ల గతవారం అర్జెంటీనాకు చెందిన ఒక 12 ఏళ్ళ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మోమో ఛాలెంజ్ ఎక్కువ శాతం పిల్లలనే ఎంట్రాక్షన్ చేస్తుంది. టాస్క్ లు చెయ్యాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేస్తారు. అయితే ఈ ఛాలెంజ్ విసురుతున్నవారు ఎవరు ? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనేవి మాత్రం అంతుపట్టకుండా వున్నాయి. ఈ ఛాలెంజ్ విసురుతున్నది మాత్రం జపాన్, మెక్సికో , కొలంబియాల నుండి వస్తున్న నంబర్స్ గా గుర్తించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: