ఆయన మాజీ మంత్రి, కాంగ్రెస్ లో ఉన్న టైంలొ డైనమిక్ గా పనిచేసేవారు. జనాలలో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. బలహీన వర్గానికి చెందిన ఆయన అప్పట్లో కాగ్రెస్ విభజన పాపానికి బలి అయిపోయారు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ పోటీ చేద్దామనుకుంటున్న ఆయన ముందు రెండు బంపర్ ఆఫర్లు రెడీగా ఉన్నాయట. మరి ఎటు మొగ్గుతారో..


సైకిలెక్కమంటున్న కళా :


శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోండ్రు  మురళీమోహనరావు ఆ పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. గడచిన నాలుగేళ్ళలో పెద్దగా రాజకీయాలోనూ లేరు. కాని కాలమనుకుని సైలెంట్ గా ఉండిపోయారు. ఎన్నికల ఏడాది వచ్చేసింది. ఆయనను తమ వైపు తిప్పుకోవాలని రెండు బలమైన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఇదే జిల్లాకు చెందిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు మురళీని సైకిలెక్కమంటున్నట్లు టాక్. ఈ మేరకు ఆయనతో చర్చలు జరిపారని ప్రచారం సాగుతోంది. పార్టీలో చేరితే ఎచ్చెర్ల సీటు ఖాయమని హామీ కూడా ఇచ్చారట.


అటు వైపు బొత్స రెడీ :


గతంలో కాంగ్రెస్ లో తనతో పాటు మంత్రిగా పనిచేసిన కోండ్రు మురళీని వైసీపీలో చేర్చాలని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. ఈ మేరకు సంప్రదింపులు కూడా మొదలెట్టేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని మురళీకి చెబుతూ వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని టాక్. సరిగ్గా ఉత్తరాంధ్రలోనే జగన్ ఉండడంతో వైసీపీ ఒత్తిడి బాగానే ఉంది.


షాకింగ్ డెసిషన్ :


ఇపుడున్న పరిస్థితులలో మురళి ఏ వైపు మొగ్గినా రెండవ పార్టీకి అది షాకింగ్ డెసిషనే అవుతుంది. కాంగ్రెస్ రాజకీయలను చూసిన మురళికి వైఎస్సార్ అంటే అభిమానం. అందువల్ల ఆయన వైసీపీలో చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ పాదయాత్ర శ్రికాకుళం చేరేనాటికి ఫ్యాన్ నీడకే ఆయన చేరుతారని వైసీపీ ధీమాగా ఉంది. అలా కనుక జరిగితే బాబు అండ్ కో కు అది బ్రేకింగ్ న్యూసే. ఈ లోగానే ఏలాగైనా టీడీపీలోకే తేవాలన్న ఆ పార్టీ పట్టుదల ఎలా సక్సెస్ అవుతుందో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: