ఏపీలో పార్టీలకు ఏం తక్కువ లేదు. ఎన్ని ఉన్నాయో ఠక్కున చెప్పడం ఎన్నికల సంఘం వంతు కూడా కాదు. ఎన్నికల టైం చూసుకుని కొత్త పార్టీలు అనేకం వస్తూనే ఉంటాయి. ఇపుడు ఆ కోవలోనే మరో పార్టీ వచ్చేసింది. . ఆ పార్టీ పేరు జన జాగ్రుతి పార్టీ. అంటే షార్ట్ కట్ లో జేజేపీ అన్న మాట. వినేందుకు బీజేపీలాగానే ఉన్నా ఇది పక్కా కొత్త పార్టీ


ఎంపీ పెట్టిన పార్టీ :


‘జనజాగృతిపార్టీ’ పేరిట అరకు ఎంపీ కొత్తపల్లి గీత సరికొత్త రాజకీయ పార్టీని  ఏర్పాటు చేశారు. ఈ రోజు విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్‌లో పార్టీ ప్రకటన, జెండాను ప్రకటించారు. పార్టీ పెడుతూనే టీడీపీ, వైసీపీలపై గీత పంచులు పేల్చారు.  చంద్రబాబు సర్కారు వల్ల ఒక్క నారా లోకేష్ కు మాత్రమే ఉద్యోగం వచ్చిందని, ప్రతిపక్షనేత  జగన్ కి   సీఎం కుర్చీ మాత్రమే కావాలంటూ గీత ఫైర్ అయ్యారు. జనసేనాని పవన్ తరహాలో ఆ రెండు కులాలకేనా రాజ్యాధికారం కావాలంటూ గీత కూడా హాట్ కామెంట్స్ చేశారుర్. బడుగుల కోసమే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు.


జెండా రెడీ..ఆ తరువాత ? :


ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన గీత ఆ తర్వాత వైసీపీకి దూరమవుతూ వచ్చారు. టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ అది జరగలేదు. చాలా కాలంగా స్వతంత్రంగా వ్యవహరిస్తోన్న ఆమె ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరతీయడం విశేషం. అంతా బాగానే ఉంది కానీ, పార్టీ పెట్టి జెండా ఎగరేసినంత మాత్రాన పండుగ వస్తుందా అని సెటైర్లు పడుతున్నాయి. అరకు ఎంపీగా ఆ ప్రాంతం ప్రజలకే పెద్దగా తెలియని గీత ఇపుడు కొత్త పార్టీ పెట్టి ఏం సాధిస్తారని కూడా అంటున్నారు. చూడాలి ఆమె స్ట్రాటజీ ఏంటో.


మరింత సమాచారం తెలుసుకోండి: