కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మీద ఆంక్షలు విధించాలనుకుంటింది. వాట్సాప్ లో ఫేక్ న్యూస్ లు ఎక్కువగా రావడం తో దేశం లో అల్లరలు పెరిగి పోతున్నాయి. దీనితో ప్రచార మాధ్యమాలను కంట్రోల్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తప్పుడు వార్తల్ని ఎవరు పుట్టించారో తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. ఈ విషయంపైనే 2 రోజుల క్రితం కేంద్ర ఐటీమంత్రి రవిశంకర్ ప్రసాద్.. వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియేల్స్ తో భేటీ అయ్యారు.

Image result for whatsapp

తప్పుడు వార్తలు విచ్చల విడిగా ప్రచారం కాకుండా అడ్డుకట్ట వేయాలని, అసలు వాటిని ఎవరు క్రియేట్ చేసి పంపిస్తున్నారో కూడా తెలుసుకునే విధానాన్ని అందుబాటులోకి తేవాలని ఆయన వాట్సాప్ నిర్వాహకులకు సూచించారు. ఒకరకంగా వాట్సాప్ కి ఇది వార్నింగ్ అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తమసేవలు అందుబాటులో ఉన్న ఏ దేశంలోనూ రాని సమస్య ఇండియాలో మాత్రమే వచ్చేసరికి వాట్సాప్ కూడా పునరాలోచనలో పడింది.

Image result for whatsapp

కేవలం ఇండియా కోసమే వాట్సాప్ పై ఆంక్షలు విధించడం, మెసేజ్ లను ఎవరు తయారు చేశారో తెలుసుకునేలా ప్రోగ్రామ్స్ రూపొందించడం సరికాదని ఆ కంపెనీ నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది.  కేంద్రమంత్రి సూచనలు అమలు చేయడానికి వాట్సాప్ సుముఖంగా లేదంటూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. కేంద్రం మరీ ఒత్తిడి పెంచితే మనదేశంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: