విభజన నేపథ్యంలో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడి రూపంలో తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి అతి దగ్గరలో హైదరాబాద్ వంటి నగరం అభివృద్ధి ఉన్న నేపథ్యంలో..చాలామంది పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేవారు ఆంధ్ర రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ను తమ ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకుంటున్నారు.

Related image

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ప్రకృతి అందాలను క్యాష్ చేసుకోవడానికి..రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడానికి కొత్త ప్లాన్ వేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి పర్యాటక స్థలాలను 12 ఎంపికచేసి వాటిని తపాలా స్టాంపు బిళ్లల రూపంలో విడుదల చేశారు.

Related image

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..ఏపీ పర్యాటకంలో తపాలా శాఖ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3వ స్ధానంలో ఉన్న ఏపీ పర్యాటకం మొదటి స్ధానానికి చేరాలి. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

Image result for ayana pathrudu ke krishna murthy

పర్యాటక రంగంలో యువతరం ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ సమావేశంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రి అఖిల ప్రియా, టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: