టీడీపీ కి ఇప్పుడు మిత్రులు కరువైనారు 2014 లో టీడిపి వెంట ఉన్న జనసేన మరియు బీజేపీ ఇప్పడూ దూరం అయ్యింది ఎప్పుడు ఏ తోడు లేకుండా ఎన్నికల్లో వెళ్లే ధైర్యం బాబుకు లేదు కాబట్టి ఇప్పుడు కూడా మిత్రుల వేట కొనసాగిస్తున్నాడు. అందులో భాగం గానే చంద్ర బాబు కాంగ్రెస్ తో పొత్తు గురించి తెగ ఆలోచిస్తున్నాడు. అయితే ఈ పొత్తు గురించి టీడిపి మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. 

Image result for chandra babu

కాంగ్రెస్ తో చేయి కలపడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం అని పార్టీలోని సీనియర్లు కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాల మీద చంద్రబాబు చాలా సీరియస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రెండురోజుల కిందట కాంగ్రెస్ తో పొత్తు ఆలోచనను వ్యతిరేకించారు.

Image result for chandra babu

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జనం బట్టలూడదీసి తంతారని పేర్కొన్న అయ్యన్నపాత్రుడు.. అదే జరిగితే తాను పార్టీ వదలిపోతానని అన్నారు. కాంగ్రెస్ తో దరిద్రాన్ని అంటకట్టుకోం అని కేఈ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇద్దరు నాయకులూ పార్టీలో చర్చించకుండా మాట్లాడడం తప్పు అని, పొత్తుల నిర్ణయాలు పోలిట్ బ్యూరో తీసుకుంటుందని.. వారిపై సీఎం సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: