ఆమె ఒకప్పుడు ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్. ఆమె మాటే తూటాలా తగిలేది. ఆమె చేసే హాట్ కామెంట్స్ తో అధికార తెలుగుదేశానికి ముచ్చెమటలు పట్టేవి. ఏకంగా చంద్రబాబు మీద ఆమె ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన తీరు అప్పట్లో చర్చనీయాంశమే అయింది. కట్ చేస్తే ఆమె ఇపుడు ఇక్కడ  అధికార పార్టీలో ఉన్నారు. . మరి ఆమె అనుకున్నట్లుగా లకీ  చాన్స్ దక్కుతుందా...


గిడ్డికి యోగం ఉందా :


ఓ టేచర్ గా ఉంటూ 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున తొలిసారి పోటీ చేసి పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి మూడేళ్ళ పాటు జగన్ పక్షాన నిలిచి అసెంబ్లీ లోపలా బయటా కూడా బాబుని గడగడలాడించేవారు. ఓ దశలో మన్యంలో బాక్సిట్ తవ్వకలు జరిపితే తల నరుకుతానంటూ  ఆవేశంతో ఊగిపోయారు. జగన్ ని అన్నా అంటూ పిలిచే ఈశ్వరి పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు. అటువంటిది ఆమెను మంత్రి పదవి పేరిట ఆకర్షించి తెలుగుదేశం పార్టీలో బాబు చేర్చేసుకున్నారు. ఇపుడు మంత్రి వర్గ విస్తరణ అంటూ హడావుడి మొదలైంది. దాంతో గిడ్డికి చాన్స్  ఇస్తారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


అలా అయితే బెర్త్ ష్యూర్ :


విశాఖ ఏజెన్సీలో టీడీపీకి పెద్దగా  బలం లేదు. రెండు దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్, తరువాత వైసీపీ గాలి బలంగా వీస్తోంది. పోయిన ఎన్నికల్లో కూడా ఏకంగా రెండు ఎమ్మెల్యే, అరకు ఎంపీ సీటు వైసీపీ సునాయాసంగా గెలుచుకుంది. దాంతో ఏజెన్సీలో పట్టు కోసం బాబు ఏరి కోరి ఈశ్వరిని టీడీపీలోకి తెచ్చుకున్నారు. అప్పట్లో ఆమెకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారమూ జరిగింది. మరో ఆరేడు నెలల వ్యవధిలో ఎన్నికలు రానున్నాయి. ఏజెన్సీలో గాలి మారాలంటే ఈశ్వరికి మంత్రి పదవి ఇవ్వడం తప్పదన్న మాట వినిస్తోంది. బాబు లెక్కలు చూసుకుంటే మాత్రం ఆమెకు చాన్స్ ఉంటుందని ఆమె వర్గం ధీమాగా ఉంది. మరి చూడాలి. ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: