జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్  కళ్యాణ్ ఎన్నికలు  దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నాడు ఒక పక్క టీడీపీ నీ మరియు ఇంకో పక్క జగన్ మీద విమర్శలు చేస్తూ సాగి పోతున్నాడు అయితే జనసేన చేసిన ప్రకటన మళ్ళీ మాట తప్పినట్లు గా కనిపిస్తుంది.  కొన్నాళ్ల కిందట జనసేన వాళ్లు మాట్లాడుతూ.. తమకు 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని.. వాళ్లంతా ఏ క్షణమైన తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించుకున్నారు.

Image result for janasena pawan kalyan

దాదాపు నాలుగైదు నెలల కిందట ఈ ప్రకటన ఒకటికి పదిసార్లు చేశారు. జనసేన తరఫున టీవీలో వకల్తా పుచ్చుకుని మాట్లాడే నేతలు ఈ ప్రకటనలు చేశారు. మరి వారిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ జనసేనలోకి చేరారో తెలిసిన సంగతే. వివిధ పార్టీల్లో పనిచేస్తూ.. అక్కడ తమకు అవకాశం దక్కదని అర్థం చేసుకున్న కొంతమంది నేతలు మాత్రం ఇప్పటి వరకూ జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Image result for janasena pawan kalyan

ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనే ఆశ మాత్రమే ఉన్నవాళ్లు తెలుగుదేశం, వైకాపాల్లో టికెట్ లభించే అవకాశాలు లేని నేపథ్యంలో జనసేనలోకి చేరుతున్న వైనాలను అంతా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు అంటోంది జనసేన పార్టీ. తమకు అంత మంది టచ్లో ఉన్నారని.. వాళ్లు తమ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతోంది. అంటే 40 నుంచి ఇరవై స్థాయికి వచ్చారనమాట. నలభై మందిలో ఎంతమంది చేరారో కానీ.. ఇప్పుడు ఇరవై మంది అంటున్నారు. ఇక వీరిలో ఎంతమంది చేరతారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: