ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్నారు. భారీ స్థాయిలో స‌మావేశం ఏర్పాటు చేసి నాలుగేళ్ల‌లో ప్ర‌జ‌ల కోసం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, ఇత‌ర అంశాలను వివ‌రించి.. సార్వ‌త్రిక స‌మ‌రానికి న‌గారా మోగించాల‌ని చూస్తున్నారు. విప‌క్షాలు కోలుకోలేని విధంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. మ‌రోప‌క్క అభ్య‌ర్థుల ఎంపిక‌పైనా ఇప్ప‌టికే స‌ర్వేలు నిర్వ‌హించి ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్‌కు  కంచుకోట లాంటి వరంగ‌ల్ జిల్లాలో ఇప్పుడు ఎవ‌రు ఇన్, ఎవ‌రు అవుట్ అనేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్రంలో ముగ్గురు లేదా నలుగురు తప్ప సిటింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డంతో  ఇచ్చే వాళ్ల‌ సంగతి సరేసరి.. తప్పించే వాళ్ల‌ జాబితాలో ఎవరున్నారనే విషయంలో ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది.
 
ఉద్యమ కాలంలో వరంగల్‌ జిల్లా క్రియాశీల క పాత్ర పోషించింది. అదే స్థాయిలో వరంగల్‌ జిల్లాలో  8 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచారు. డోర్నకల్‌ కాంగ్రెస్‌, పరకాల, పాలకుర్తిలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.. నర్సంపే ట నుంచి మాత్రం కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా గెలుపొందిన దొంతి మాధవరెడ్డి అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. మిగిలిన ఇద్దరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. వీరిలో  ఎలిమినేట్‌ అయ్యేదెవరనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఈ జిల్లాలో గ్రూపు తగాదాలు నెలకొన్నాయి. కేసీఆర్‌ దృష్టికి చాలా సార్లు వెళ్లిన‌ప్పటికీ మౌనం పాటించారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆది నుంచి వివాదాలకు కేంద్రం బిందువుగా మారాడు. ఇక వరంగల్‌ తూర్పు నియోజకవర్గం గ్రూ పు తగాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 
అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఇక్కడ టీఆర్‌ఎస్ లో కొనసాగుతున్నారు. మేయర్‌ నరేందర్‌, మాజీ ఎంపీ సుధారాణి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు, ఎవరికీ వారుగా తూర్పు టికెట్‌ ఆశిస్తున్నారు. వీరంతా కలిసి క ట్టుగా కొండా దంపతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.  స్పీకర్‌ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వ హిస్తున్న భూపాలపల్లిలో కూడా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎక్కువ‌య్యారు. టీడీపీ సీనియర్‌ నేత గండ్ర సత్యనారాయణరావు టీఆర్ఎస్‌లో చేరారు. తనకు టికెట్‌ ఇస్తానంటేనే పార్టీలో చేరానని బ హిరంగంగానే చెబుతున్నారు. మంత్రి చందూలాల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ప్రత్యేక పరిస్థితి నెలకొంది. అనారోగ్య కారణాలతో ఆయన కుమారుడు ప్రహ్లాద్‌కే టికెట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 


స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కూడా సిటింగ్‌ ఎమ్మెల్యేను మారుస్తారన్న ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. ఇటీవలే రాజయ్యను స్వయంగా సీఎం కేసీఆర్‌ పిలిపించుకుని అలాంటి ప్రచారాలు నమ్మవద్దని చెప్పినట్టు ప్రచారం జరుగు తోంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన రాజారపు ప్రతాప్‌కే అవకాశం వస్తుందని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారు. ఇక మహబూబాబాద్‌ నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే మాలోత్‌ కవిత, మోహన్‌లాల్‌ తదితరులు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ ఈ సారి తనకే టికెట్‌ వస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టే అసమ్మతి వర్గం నాయకులు వ్యూహ రచనతో దూసుకెళుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: