ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఎన్నో గొప్ప గొప్ప పదవులు మోసి చివరికు ఎటు కాకుండా పోయినాడని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ పాతాళానికీ పోయింది. దానితో ఆ పార్టీ లో ఉన్న కొంత మంది నాయకులూ కూడా పార్టీ లు మారి తమ రాజకీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. అయితే ఆనం ఇప్పటి వరకు  టీడీపీ లో ఉన్న పార్టీ లో తగినంత గౌరవం రాలేదని పార్టీ మారడానికి సిద్ధం అయిపోయాడు. 


ఆనం కు ఇంకా హామీ రాలేదు... అందుకే జగన్ చుట్టూ తిరుగుతున్నాడు..!

ఆనంను చేర్చుకోవడం వైసీపీకి కలిసొచ్చే అంశమే అయినా నియోజకవర్గం విషయమే తలనొప్పిగా మారింది. తన ముఖ్య అనుచరులు మేకపాటి కుటుంబీకులు ఆత్మకూరుకి ఫిక్స్ అయ్యారు. వెంకటగిరి నియోజకవర్గంపై ఇప్పటికే జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నెల్లూరు రూరల్, సిటీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. సో.. ఆనం కుటుంబానికి పట్టున్న ఈ 4 నియోజకవర్గాల్లో ఆయన్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాలనే విషయంపై జగన్ కూడా కసరత్తు చేయాల్సి వస్తోంది.

Image result for anam ramanarayana reddy

అందుకే నియోజకవర్గం అనే హామీ అడక్కుండా ఆనంను పార్టీలో చేర్చుకుంటున్నారు జగన్. ఆ ఒక్కటీ అడక్కు అనే కండిషన్ పెట్టేశారు. ఈ కండిషన్ కు ఓకే చెప్పిన తర్వాతే పార్టీ చేరికకు మహూర్తం ఫిక్స్ అయింది. ఈ సస్పెన్స్ ఎన్నాళ్లు కొనసాగుతుందో, నియోజకవర్గం డిసైడ్ కాకుండా ఎన్నికలను ఎదుర్కోడానికి ఆయన ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో వేచిచూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: