ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపధ్యం లో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఎన్నికల్లో పాల్గొంటారని వార్తలు ఈమధ్య బాగా వినబడుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మంత్రులు ఇటీవల కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు అనే అంశం గురించి సంచలన కామెంట్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసినదే.

Related image

అదే టైంలో టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుల గురించి ఆలోచించేది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు అని తేల్చి చెప్పడంతో...చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ టీడీపీ కలిసి ఆంధ్రరాష్ట్రంలో పోటీ చేస్తారని అనుకున్నారు అయితే ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related image

ఇటీవల కర్నూలు జిల్లాలో ధర్మ పోరాట దీక్ష విజయవంతమైందని మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపోరాట దీక్షకు వచ్చిన స్పందనతో జిల్లాలోని అన్ని నియెజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Image result for chandrababu ke krishna murthy

టీడీపీ జాతీయ పార్టీని, ఇతర పార్టీలతో పొత్తులు ఒకేలా ఉండవని, ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయని చెప్పారు.  తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై సీఎం చంద్రబాబు త్వరలో ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటారని కేఈ తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: