Image result for drunk and drive case
ఇప్పుడు హై-సొసైటీ అంటే 'తింటం - తాగటం - తిరగటం' అనబడే గాంగ్ గా ప్రసిద్ధి పొందుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, సూడో కార్పోరేట్ల  సడన్ గా పైకొచ్చిన నడమంత్రపు సిరి గాళ్ళ సంతానం — మరీ ముఖ్యంగా ఈ గాంగ్ లో చేరుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వివేకం నశించి - 'మందు విందు పొందు' లతో విచ్చల విడితనం విలాసాలు కులాసాలు చేస్తూ కొన్నిసార్లు తాము బ్రతికేది ఒక నాగరిక సమాజంలో అనేది మరచిపోయి ప్రవర్తిస్తున్నారు.
Related image
పదవులు అలంకరించి అధికారంలో ఉన్న తమ పెద్దల మాటున మత్తు, మైకం, ఆపోసిట్-సెక్స్ తో కేళీ విలాసాలు కొనసాగించటం సదా మామూలై పోతోంది.  
 Image result for drunk and drive caseహైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిధిలో శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఒక ఐఏఎస్ అధికారి గారి కూతురు పట్టుబడింది. హోండా సిటీ కారులో వచ్చిన ఈమె కారుపై "డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ - అడిషినల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్"  అని ఉంది. ఇంకేం పెద్దల అధికారం, తాగిన మత్తు తలకెక్కి  మందు మైకం  కమ్మేసిన దేహంపై తన నియంత్రణ కోల్పోయి ఉంటుంది.  
Image result for drunk and drive case
తాను ఐఏఎస్ అధికారి కుమార్తెనని, నన్నే పట్టుకుంటారా? అని మద్యం మత్తులో ఉన్న గీతాంజలి అనే ఈ మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. అయితే ఆమె వాదనను వారు పట్టించుకోకుండా, మహిళా పోలీసుల సాయంతో 'బ్రీత్ ఎలైజర్ టెస్ట్'  నిర్వహించారు. ఆమె కారును సీజ్ చేశారు. గీతాంజలికి కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామని వారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: