ఆ ఇద్దరూ ఉద్దండ పిండాలే. రాజకీయాలలో డక్కామెక్కీలు తిన్న వారే. తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరితనం వారికి మెండుగానే ఉంది. అటువంటి ఘనాపాటీలు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. కొంతకాలంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. అధినేత వైపు, పార్టీ వైపు కనీసం కన్నెత్తి చూడడంలేదు. ఇంతకీ వారి మైండ్ గేం ఏంటో..


అక్కడ ఆయన కింగ్ :


శ్రీకాకుళం రాజకీయాలలో ధర్మాన కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మూడు దశాబ్దాలకు పైగా జిల్లా పాలిటిక్స్ శాసిస్తూ వస్తున్నారు. సింగిల్ హ్యాండ్ తో చక్రం తిప్పగల‌ సామర్ధ్యం ఆ ఫ్యామిలీకి ఉంది. అటువంటి ధర్మాన ఈ మధ్య ఎక్కడా పెద్దగా కనిపించండంలేదు. పార్టీలో యాక్టివ్ రోల్  ప్లే  చేయడంలేదని టాక్. అధినేత జగన్ ఉత్తరాధ్రలోకి ప్రవేశించి చాల రోజులవుతున్నా ఆయన అలికిడి అంతగా లేదు. రీజనేంటో.


ఈయనా గమ్మున్నారే:


ఇక ప్రతీ దానికీ మీడియా ముందుకు వచ్చి సందడి చేసే సీనియర్ నేత, విజయనగం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ కూడా ఈ మధ్య గమ్మునుంటున్నారు. ఆయన సందడి కూడా పెద్దగా కనిపించడంలేదు.  పార్టీ అధినాయకుడే పక్క జిల్లాలో ఉంటే  బొత్స పెద్దగా వచ్చింది లేదన్న టాక్ వినిపిస్తోంది.  బొత్స  సైలెంట్ వెనక కారణం  ఏమై వుంటుంది...



ఉత్తరాధ్ర జిల్లాలలో  దిగ్గజాలు లాంటి సీనియర్లు ఇలా   హటాత్తుగా తెర వెనక్కు వెళ్ళిపోవడం వెనక అనేక అర్ధాలను అధికార టీడీపీతో పాటు రాజకీయ పండిట్స్ వెతుకుతున్నారు. ఎన్నికల ఏడాదితో వైసీపీ ఉత్తరాంధ్రలో లక్ చెక్ చేసుకునే కీలకమైన ఈ ఇద్దరి సైలెంట్ ఇంటరెస్టింగ్ టాపిక్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: