ఆ మాజీ మంత్రి వైఎస్సార్ కు వీర విధేయుడు. బడుగులలో మంచి బలం వున్న నాయకుడు. ఏ పార్టీకైనా పెట్టని కోట లాంటి వాడు. ఇంటెక్యువల్ పొలిటీషియన్ గా పేరుంది. అటువంటి నాయకుడు ఇన్నాళ్ళూ తాను విభేధించే పార్టీ సరరన ఇపుడు చేరుతున్నారు. ఇది ఆసక్తి కలిగించే పరిణామైతే ఇందులో గెలుపు అధికార తెలుగుదేశానిది. మరి, ఓటమి కచ్చితంగా వైసీపీదేనంటున్నారు.


ఫ్యాన్ నీడకేనంటూ :


శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావు వైసీపీలోనే చేరుతారంటూ చానాళ్ళుగా టాక్ నడుస్తూ వచ్చింది. రేపో మాపో కండువా సీన్ అంటూ లెక్క లేనన్ని సార్లు న్యూస్ వచ్చింది. కాంగ్రెస్  పార్టీకి చెందిన వారు, వైఎస్ కు సన్నితుడు కావడంతో నాచురల్ గా మురళి ఫ్యాన్ పార్టీ వైపే వస్తారని అంతా ఆశించారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఆయన 31న టీడీపీలో చేరబోతున్నారు. ఈ సంగతి మురళి స్వయంగా మీడియాకు చెప్పేశారు.


ఫెయిల్ అయ్యారా :


పార్టీకి బలమైన  లీడర్లు అవసరం, లీడర్లకు మంచి పార్టీ కావాలి. ఇలా ఈక్వేషన్లు చూసుకుంటే మురళీ అవసరం వైసీపీకి చాలానే ఉంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఆయనకు మంచి పట్టు కూడా ఉంది. అటువంటి నాయకున్ని వైసీపీ వైపుగా తీసుకురాలేకపోవడం వెనక కచ్చితంగా పార్టీ ఫెయిల్యూర్ ఉందంటున్నారు. నాయకుల మధ్యన ఉన్న గ్రూప్ పాలిటిక్స్ తో జిల్లాలో బలాన్ని పెంచుకోవాల్సిన వైసీపీ అలా టీడీపీకు కొత్త బలాన్ని ఇచ్చేసినట్లైందంటున్నారు
.
షాకింగేనా  :


ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ కి ఇది షాక్ అని చెప్పుకోవాలి. ఇప్పటికి చాల రోజులు కావస్తున్నా ఈ జిల్లాల‌లో పట్టున్న నాయకుడు ఇంతవరకూ వైసీపీ వైపు చూడలేదు. జగన్ పాదయాత్రలో చేరుతారనుకున్న మురళి లాంటి వారు మరో వైపు టీడీపీ తీర్ధం తీసేసుకుంటున్నారు. అదీ అధినేత ఇక్కడ ఉండగానే జరుగుతున్న ఈ మార్పులు పార్టీకి కొంత దెబ్బేనంటున్నారు. వచ్చే ఎన్నికలలో డ్యాం ష్యూర్ గా గెలుస్తామని చెప్పుకుంటున్న పార్టీ వైపు కాకుండా అధికార పార్టీ వైపు నేతలు వెళ్తున్నారంటే వైసీపీ వ్యూహకర్తలు ఆలోచించుకోవాల్సిందే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: