ఈ మాటలు అంటుంది ఎవరో కాదు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..అంటుంది ఎవరినో తెలుసా..ఈ మద్య తమిళ ప్రజలను శోక సంద్రంలో ముంచిన పోయిన మహానేగ కరుణానిధి తనయుడు స్టాలిన్.  డీఎంకే నేత స్టాలిన్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన కరుణానిధి సంస్మరణ సభకు హాజరైన విషయాన్ని ప్రకటిస్తూ మోహన్ బాబు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 
Image result for karunanidhi
కోయంబత్తూరులో జరిగిన దివంగత కరుణానిధి సంస్మరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరుణ ఒక గొప్ప లెజెండరీ ఫాదర్ అని కితాబిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరుణానిధితో, ఆయన కుటుంబంతో మోహన్ బాబుకు మంచి స్నేహం సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని..ఆయన గొప్ప రాజకీయ నాయకుడు అని పలుమార్లు అన్నారు మోహన్ బాబు. 
Image result for karunanidhi stalin
తెలుగు సినీ పరిశ్రమతో కరుణానిధికి ఎంతో అనుబంధం ఉందని..అందులోనూ ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ తో కూడా మంచి అనుబంధం ఉందని అన్నారు.  ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాదుకు తరలి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. మోహన్ బాబు సినిమా కార్యక్రమాలకు కూడా కరుణ హాజరైన సందర్భాలు ఉన్నాయి. స్టాలిన్‌ను సోదరుడిగా సంబోధించిన కలెక్షన్ కింగ్.. డీఎంకే అధ్యక్ష బరిలో ఉన్న స్టాలిన్ తమిళనాడుకు సీఎం కూడా కావాలని ఆకాంక్షించారు. స్టాలిన్‌‌ను తమిళనాడు సీఎంగా చూస్తానని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: