టీడీపీ కి ఇప్పుడు మిత్రులు కరువైనారు 2014 లో టీడిపి వెంట ఉన్న జనసేన మరియు బీజేపీ ఇప్పడూ దూరం అయ్యింది ఎప్పుడు ఏ తోడు లేకుండా ఎన్నికల్లో వెళ్లే ధైర్యం బాబుకు లేదు కాబట్టి ఇప్పుడు కూడా మిత్రుల వేట కొనసాగిస్తున్నాడు. అయితే తెలుగు దేశం పార్టీ 2019 లో కాంగ్రెస్ కలిసి నడుస్తుందని ఇప్పటికే పార్టీ లో మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్తో పొత్తు లేదన్న విషయాన్ని  చంద్ర బాబు ఎక్కడ చెప్పలేదు. 

Image result for chandra babu

సాధారణంగా కాంగ్రెస్‌తో పొత్తు ఆలోచన లేకపోతే పార్టీ సమావేశాలలో కాని, మంత్రులు, ఎంపీల వంటి నేతల సమక్షంలో కాని అసలు ఆ చర్చేరాదు. బెంగుళూరు వెళ్లీ మరీ రాహుల్‌ గాంధీతో చేయి కలిపేవారు కాదు. అంతేకాదు.. స్వయంగా తన కోడలు బ్రాహ్మణిని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లనిచ్చేవారు కాదు. ఇప్పటికే చంద్రబాబుపై కొన్ని విమర్శలు ఉన్నాయి.

Image result for chandra babu

అధికారం కోసం, ఎలాంటి రాజకీయం అయినా చేస్తారని ఆయనపై చాలామంది అభిప్రాయం. నిజానికి రాహుల్‌ మీటింగ్‌కు బ్రాహ్మణి వెళ్లడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఒక పార్టీ అధినేత, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలు తమకు రాజకీయంగా ఇంతకాలం పెద్ద శత్రువుగా ఉన్న పార్టీ అధినేత మీటింగ్‌కు వెళతారా? అన్న ప్రశ్న అందరిని తొలిచి వేసింది. అయితే విలువలకు తిలోదకాలు ఇచ్చేసిన చంద్రబాబు కాని, ఆయన పార్టీ నేతలు కాని ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవడం లేదని అర్థం అవుతుంది. దీనిపై వారు జవాబు కూడా చెప్పలేని పరిస్థితిలో పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: