రానున్న ఎన్నికలలో ఎవరికి ఏ విధంగా ఉంటుందన్నదానిపై పలు రకాల సర్వేలూ, వార్తా విశ్లేషణలూ వెలువడుతున్న సంగతి విధితమే. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు రానున్న ఎన్నికలు హోరా హోరీని తలపించడం ఖాయమన్న మాటగా ఉండి. అధికార టీడీపీ,విపక్ష  వైసీపీల మధ్య జరిగే ఈ పోటా పోటీలో విజేత ఎవరు అంటే ఇప్పటికీ అంచనాలకు అందడంలేదు.


యాంటీ ఇంకెంబెన్సీ ఉందా :


నిజానికి ఏ సర్కార్ మీదనైనా యాంటీ ఇంకెంబెన్సీ చివరి ఏడాదిలో ఉవ్వెత్తున లేస్తుంది. ఏపీ వరకూ చూస్తే అటువంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా బాబు కు బాగానే ఉందన్న మాట ఉంది. దీనికి ప్రధాన కారణం అనుకూల మీడియానే. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కంపించకుండా అస్మదీయ మీడియా తాళం వేస్తోంది. 


పట్టణ ఓటర్లపై ప్రభావం :


ఈ మీడియా ప్రభావం పట్టన ఓటర్లపైన  ఎక్కువగా ఉంటోంది. చదువుకున్న వారు అధికంగా ఉండడం తో పాటు, మీడియా వార్తలను బాగా ఫాలో అయ్యేది వీరే కాబట్టి పట్టణాలలో బాబు కు అంతా బాగుందన్న మాట గట్టిన వినిపిస్తోంది. అదే టైంలో తట‌స్థులు, మధ్యతరగతి వర్గాలకు టీడీపీ సర్కార్ చేసేదంతా బాగానే ఉందనిపించేలా మీడియా హైప్ క్రియేట్ చేయడంలో   సక్సెస్ అవుతోంది.


పల్లెల్లో అలా :


అయితే చదువుకున్న వారి కంటే లేని వాడే నయమన్న ఓ ముతక సామెత మాదిరిగా పల్లె జనం మాత్రం అసలు విషయాలను బాగానే అర్ధం చేసుకుంటున్నారు. బాబు హామీల అమలు కాకపోవడం నుంచి పాలనలో లోపాలపై వీరే బాగా  విశ్లేషణ చేస్తున్నారు. రైతు రుణ మాఫీ,  డ్వాక్రా మహిళల హామీలు తీర్చకపోవడం, నిరుద్యోగ సమస్యల నేపధంలో వీరంతా యాంటీగా ఉంటున్నారు. పైగా ఇక్కడ జన్మ భూమి కమిటీలు ఎక్కువగా నెగిటివ్ ప్రభావాన్ని చూపించేలా చేస్తున్నాయి. దాంతో వీరంతా టీడీపీకి దూరమవుతున్నారు. ఇక్కడే వైసీపీ కి సానుకూలత కూడ బాగా కనిపిస్తోంది. 



దానికి తోడు అన్నట్లు జగన్ పాదయాత్ర కూడా పల్లెలపైనే గురి పెట్టడంతో గ్రామీణం బాగానే టర్న్ అవుతోంది. మరి రేపటి ఎన్నికలలో పట్టణాల  తీర్పు ఒకలా, పల్లెల పంచాయతి మరోలా  ఉంటే ఎవరికి లాభిస్తుందన్న దానిపైన కూడా చర్చ సాగుతోంది. అప్పట్లో అన్న నందమూరికి పల్లె జనం నీరాజనం పడితే కాంగ్రెస్ కి పట్టణాలు అండగా ఉండేవి. అదే సీన్ రిపీట్ కాబోతోందా అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది.చూడాలి ఏం జరుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: