శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి కోండ్రు మురళి  టీడీపీలోకి చేరేందుకు రెడీ కావడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున ప్రత్యేక హోదా తో మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని గట్టిగా  ప్రయత్నిస్తున్న  పార్టీకి మురళి రూపంలో గట్టి దెబ్బ  పడింది. దీంతో అందరి చూపు ఇపుడు ఆమెపై పడుతోంది.


ఆమె డిసిషన్ ఏంటో :


శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో మరో కీలక నాయకురాలు, కేంద్ర మాజీ  మంత్రి కిల్లి క్రుపారాణి మీద అందరి చూపు పడుతోంది. జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన క్రుపారాణి 2009 ఎన్నికలలో ఏకంగా అప్పటి టీడీపీ బిగ్ షాట్ కింజరాపు ఎర్రన్నాయుడుని ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. యూపీయే టూ లో ఆమె కమ్యునికేషన్స్ శాఖ మంత్రిగా కూడా బాగానే రాణించారు. 2014 లో విభజన కారణంగా ఆమే ఓటమి పాలు అయ్యారు.


అప్పట్లోనే టాక్ :


కోంద్రు మురళి, క్రుపారాణిలు పార్టీ మారుతారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. క్రుపారాణి వైసీపీ వైపు చూస్తున్నారని టాక్ నడచింది. ఆమె టెక్కలి సీటు ఆశిస్తున్నారని కూడా చెప్పుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో ఆ తరువాత ఆమె సైలెంట్ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కోండ్రు మురళి తీసుకున్న ఈ నిర్ణయంతో క్రుపారాణి సైతం పార్టీ మారుతారని మరో మారు వూహాగానాలు జోరందుకున్నాయి.


మరి నిజంగా  ఆమె పార్టీ మారితే ఏ వైపు వస్తారన్నది ఇపుడు హాట్ టాపిక్. మొత్తానికి ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ బలపడుతోందని కాంగ్రెస్ సంబరపడినంత సేపు పట్టలేదు, ఉన్న నాయకులు సైతం పార్టీకి టాటా చెప్పేస్తూంటే హస్తం బొమ్మ మసకబారుతోంది.\


మరింత సమాచారం తెలుసుకోండి: