ఆమె రాజకీయ ప్రసంగం చేస్తే జనాలు ఆనందంతో పరవళ్ళు తొక్కేవారు. ఆమెలో తమ ప్రియతమ నాయకున్ని చూసుకుని ఎంతగానో ముర్సిపోయేవారు. హావభావాల నుంచి మాట తీరు వరకు అచ్చం ఆయనలాగానే అనిపించే ఆమె అప్పట్లో రాజకీయన్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు. ఇదంతా అయిదేళ్ళ క్రితం కధ. ఇపుడు మళ్ళీ ఆమె టాపిక్ ముందుకు వస్తోంది.. ఎందుకో...


గురి తప్పని బాణం :


జగన్ జైలులో ఉన్నపుడు అన్న వదిలిన భాణం అలా దూసుకువచ్చేసింది. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, మరో వైపు విభజన వేడి, ఇలా ఏపీ అతలాకుతలం అయిన నేపధ్యంలో పార్టీని బతికించేలా వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఓ ఊపు ఊపేసింది. రాజకీయ గండర గండడు చంద్రబాబుకు సరి సమానంగా ఆమె పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ సాగిన  షర్మిల పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు.


అలా తెర వెనక్కు :


జగన్ జైల్ నుంచి వచ్చాక హైదరాబాద్లో సమైక్యాంధ్ర గర్జన సభలో కనిపించిన షర్మిల ఆ తరువాత తెర వెనక్కు వెళ్ళిపోయారు. ఆమె ఎన్నికలలో పోటీ చేస్తారని అప్పట్లో వినిపించినా అలా జరగలేదు. ఆ తరువాత ఆమె ఓ ఇంటర్వ్యూలో తాను ఇపుడు రాజకీయాలు దూరంగా ప్రశాంత జీవితం గడుపుతున్నట్లుగా చెప్పారు. అన్న జగన్ జైల్లో ఉన్నపుడు అవసరమైన టైంలో అపుడు రాజకీయాలలోకి రావాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.


జగన్ నోట ఆమె మాట:


విశాఖ పాదయాత్రలో ఉన్న జగన్ రక్షాబంధన్ వేళ చెల్లెమ్మ షర్మిల పేరు తలచుకున్నారు.  ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ అన్నగా దూరంగా  ఉన్నా తన రక్ష ఆమెకు ఎపుడూ ఉంటుందని చెప్పారు. జగన్ ఇలా అనడం వెనక రాజకీయ కోణాన్ని ఇపుడు చూడడం ప్రారంభించారు. జగన్ షర్మిల గురించి ఇలా తలవడం వెనక ఆమె రీ ఎంట్రీ దాగి ఉండొచ్చన్న ఆలోచనలు సాగుతున్నాయి. 


ఎక్కడ నుంచి:


వచ్చే ఎన్నికలలో షర్మిల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లుగా భోగట్టా. రాజన్న తనయగా షర్మిల ఫాలౌయింగ్ పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఆమెను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ఆలొచన చేస్తున్నారని టాక్. అదే కనుక నిజమైతే రేపటి ఎన్నికలు రసవత్తరం కావడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: