ఇటీవల పాకిస్థాన్ దేశంలో నూతనంగా ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే ప్రధాని నివాసంలో ఉండనని తెలిపి...తన సొంత నివాసం నుండి పరిపాలన చేస్తానని...సుఖభోగాల తో కూడిన ప్రధాని నివాసం వద్దని షాకింగ్ డెసిషన్ తెలియజేశాడు ఇమ్రాన్ ఖాన్.

Image result for imran khan

ఇదేక్రమంలో దేశ ప్రధాని అలాగే ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షుడు..ఇలా ఎవరైనా సరే బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణించాలని శాసనం చేసిన ఆయన... తాజాగా వీఐపీలకు రాజభోగాలపై ఫోకస్ చేశారు. రాజకీయ నాయకులు, మిలటరీ అధికారులు, న్యాయమూర్తులు సహా ఉన్నతాధికారులు విమానాశ్రయాలకు వస్తే వీఐపీ ప్రొటోకాల్‌ను పాటించాలి.

Image result for imran khan

ఇక మీదట ఇలాంటి ప్రొటోకాల్‌ను పాటించాల్సిన అవసరం లేదని పాక్ హోంమంత్రిత్వ శాఖ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదంతా దేశంలో ప్రజలంతా సమానమే అన్న భావం కలగాలని ప్రధాని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పాక్ సమాచార మంత్రి తెలిపినట్లుగా మీడియా తెలిపింది.

Image result for imran khan

అయితే వీఐపీ ప్రోటోకాల్‌పై గతంలోనూ నిషేధించినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు..అయితే ప్రస్తుతం మాత్రం ఇది పక్కాగా అమలు చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. ఏదిఏమైనా ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పీఠంపై కూర్చున్నాక...పాలన విషయంలో కొంత స్పీడు పెరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరోపక్క భారత్ పై కూడా చాలా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: