ఎట్టకేలకు ఆనం రామ నారాయణ రెడ్డి వైసీపీ లోకి చేరడానికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. అయితే దీనితో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరింత రసకందం లో పడ్డాయి. ఆనం తన బలాన్ని నిరూపించే క్రమం లో జిల్లాలో ఉన్న కార్య కర్తలను సమాయత్తం చేస్తున్నాడు. వైసిపిలోకి చేరుతున్న ఆనం త‌న‌తో పాటు త‌న మ‌ద్ద‌తుదారుల‌ను కూడా టిడిపిలో నుండి తీసుకెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌ట‌మే ఈ వేడికి కార‌ణం.


ఆనం కు ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పార్టీలో చేరక తప్పలేదు..!

ఆత్మ‌కూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న త‌మ మ‌ద్ద‌తుదారుల‌ను వైసిపిలోకి తీసుకెళ్ళాల‌న్న‌ది ఆనం ఆలోచ‌న‌. అందుకు విరుగుడుగా తెలుగుదేశంపార్టీ నేత‌లు త‌మ వంతుగా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఆనం వ‌ర్గీయులుగా ముద్ర‌ప‌డిన వారితో పాటు మ‌ద్ద‌తుదారుల‌తో టిడిపి నేత‌లు మంత‌నాలు మొద‌లుపెట్టారు. వైసిపిలోకి చేరేముందే త‌న బ‌ల‌మేంటో నిరూపించాల‌న్న‌ది ఆనం ఆరాటం. అందుక‌నే ఈరోజు త‌న ఇంట్లో త‌న మ‌ద్ద‌తుదారుల‌తో పెద్ద స‌మావేశ‌మే నిర్వ‌హిస్తున్నారు.


ఆనం కు ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పార్టీలో చేరక తప్పలేదు..!

స‌మావేశానికి రావాల్సిందిగా ఆన‌మే స్వ‌యంగా ఆహ్వానించారు. ఇక ఆనంకు ఎటువంటి బ‌లం లేద‌ని చాట‌ట‌మే టిడిపి ఉద్దేశ్యం. అందుక‌నే ఆనం నిర్వ‌హిస్తున్న స‌మావేశానికి వెళ్ళవ‌ద్దంటూ టిడిపి జిల్లా నాయ‌క‌త్వం ఆనం మ‌ద్ద‌తుదారుల‌ను బుజ్జ‌గిస్తోంది. ఒక‌వైపు ఆనం ఆహ్వానం, మ‌రోవైపు టిడిజి బుజ్జ‌గింపులు దాంతో ఏం చేయాలో ఆనం మద్ద‌తుదారులు గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. చివ‌రికి ఎవ‌రి మంత్రాంగం గెలుస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: