ఏ పార్టీనైతే దరిద్రమంటూ నానా మాటలు అంటున్నవో ఆ పార్టీలోనే పుట్టలేదా అంటూ కర్నూల్ జిల్లాకు చెందిన పెద్దాయనను మరో పెద్దాయన కడిగిపారేశారు. తమ పార్టీని ఇష్టం వచ్చినట్లుగా నిందించడం పట్ల ఆయన మండిపడుతున్నారు. రాజకీయాలలో మాట్లాడే విధానం ఇదేనా అంటూ గుస్సా అయ్యారు. ఇంతకీ ఎవరా పెద్దాయన. ఏమా కధ...!


మళ్ళీ గుచ్చుకున్న కత్తులు :


కర్నూల్ జిల్లాలో రెండు పెద్ద రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. దశాబ్దాల తరబడి రాజకీయం చేస్తున్న ఈ కుటుంబాలలో రాజకీయ సఖ్యత  ఏ మాత్రం లేకపోగా శత్రువుల కంటే  ఎక్కువగా భావిస్తూ పాలిటిక్స్ చేస్తారు. కర్నూల్ పెద్దాయనగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిని చెప్పుకుంటారు. ఆయన వారసుడిగా ఇపుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తరఫున  ఉన్నారు.
ఇక మరో పెద్దాయన, ఉప ముఖ్యమంత్రి కేయీ క్రిష్ణమూర్తి ఉన్నారు. ఇద్దరి వైరం రాజకీయాలనే మించిపోతుంది. అందుకే పార్టీ లైన్ కన్నా ఇక్కడా వ్యక్తిగత విరోధమే ఎక్కువ. ఈ కారణంగానే కేయీ ఈ మధ్యన కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తే లేదన్నారు. అంతటికో ఆగకుండా కాంగ్రెస్ ని ఓ దరిద్రంతో పోల్చేశారు. 


కేయీపై హాట్ కామెంట్స్:


టీడీపీ కంటే ముందు కేయీ క్రిష్ణమూర్తి  కాంగ్రెస్ లో ఉండేవారు. దానికి ద్రుష్టిలో వుంచుకుని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి లేటెస్ట్ గా ఆయన‌పై సెటైర్లు వేశారు. రాజకీయ పుట్టుక ఇచ్చిన కాంగ్రెస్ ని దరిద్రం అనదం భావ్యమా అంటూకౌంటర్లేశారు. ఇదేం పద్దతి అంటూ గట్టిగానే బదులిచ్చారు. బీజేపీ నెత్తిన చేయి పెడితే చంద్రబాబు తమ వైపు చూస్తున్నారంటూ కోట్ల చెప్పుకొచ్చారు.
అలాంటిది ఆయన పాటి ఆలోచన మంత్రులకు లేకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. మొత్తానికి పొత్తులు కాదు కానీ పూర్వ వైరం మరో మారు కేయీ కోట్ల మధ్యన మాటల యుధ్ధాన్ని లేపినట్లైంది. చూడాలి దీనికి కేయీ ఎలా కౌంటర్ అటాక్ చేస్తారో.



మరింత సమాచారం తెలుసుకోండి: