ఏపీలో కామ్రెడ్స్ పరిస్తితి దారుణంగా ఉంది. ప్రజా పోరాటలు చేస్తున్నా జనం ఓటేయడం లేదు. మరో వైపు ఇతర పార్టీలతో కలసి సాగుదామంటే ఎవరూ ముందుకు రావడంలేదు. మొత్తానికి విభజన ఏపీలో రాజకీయంగా బాగా దెబ్బ తిన్న వామపక్షాలు రేపటి ఎన్నికల లో ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.


ఆ వైపు నుంచి రాదేం :


వామపక్షాలు ఈ మధ్య కాలంలో జనసేనతో అవగాహనకు రావాలని అనుకున్నాయి. దానికి తగినట్లుగానే ఆ పార్టీ అధినత పవన్ తో అప్పట్లో భేటీలు కూడా జరిగాయి. రెండు నెలల క్రితం ఎర్రన్నలతో కలసి విజయవాడలో పవన్ పాదయాత్ర కూడా చేశారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ జనసేనాని కనిపించడం మానేశారు. ఇప్పటికి పలు మార్లు కామ్రెడ్స్ జనసేనతో పొత్తు అంటూ ప్రకటించుకున్నా ఆ వైపు నుంచి తగిన స్పందన రావడం లేదని టాక్.


ఒంటరి  యాత్రే :


ఇక లేటెస్ట్ గా విజయవాడలో కామ్రెడ్స్ నిర్వహించిన ఆ మీటింగ్ కి జనసేనను ఆహ్వానించినా ఆ పార్టీ నాయకులు అటెండ్  కాలేదు. అయినా ఆ సభలో సీపీఐ రామక్రిష్ణ, సీపీఎం మధు ఇద్దరూ పవన్ ని ఓ రేంజిలో పొగిడారు. తమకు పవన్ అండగా ఉన్నారని, ఏపీలో మూడవ రాజకీయ కూటమి ఖాయమని కూడా ప్రకటించుకున్నారు. మళ్ళీ ఏం జరిగిందో కానీ లేటెస్ట్ గా కామ్రెడ్స్  బస్సు యాత్రను ఒంటరిగానే చేయబోతున్నారట.


పొత్తు పొడిచేనా :


ఈ విషయాన్ని సీపీఐ రామక్రిష్ణ ప్రకటిస్తూ ఈ నెల 29వ్ అనంతపురం నుంచి సెపెటెంబర్ 1 న విశాఖపట్నం నుంచి వామపక్షాల బస్సు యాత్ర మొదలవుతుందని చెప్పారు. సెప్టెంబర్ 14న విజయవాడలో భారీ సభ ఉంటుందని అన్నారు. మూడవ కూటమి కోసం కామ్రెడ్స్ గట్టి పోరాటం చేస్తాయని చెప్పుకున్నారు. ఈ వివరాలలో ఎక్కడా జనసేన ప్రస్తావన లేకపోవడం విశేషం. మొత్తానికి కామ్రెడ్స్ మళ్ళీ వారి సొంత బాటలోనే ఒంటరి ప్రయాణానికే రెడీ అయిపోయాయి. దీనిని బట్టి చూస్తూంటే వచ్చే ఎన్నికలలో ఎర్రన్నలది ఒంటరి పోరేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: