అన్న నందమూరి తారక రామారావుకు ఏడుగురు కుమారులు వారిలో మూడవ కుమారుడు హరిక్రిష్ణ. అన్న గారిలోని పట్టుదల, మొండితనం హరికి కూడా అలా వచ్చేశాయి. బోళాతనం, మంచితనం కూడా ఆయనకు పెట్టని ఆభరణాలుగా ఉన్నాయి. నిగర్వి. ఎదుటి వారిని గౌరవించే మసస్తత్వం హరిక్రిష్ణకు తండ్రి నుంచి అబ్బిన సంస్కారంగానే చెప్పుకోవాలి. పెద్దగా చదువుకోకపోయినా లోకాన్ని చదివిన ఆయన జీవిత పర్యంతం మర్యాదని, మంచిని కాపాడుకుంటూనే వచ్చారు.


పల్లెటూరు నేపధ్యం :


స్వతహాగా పల్లెటూరు నుంచి వచ్చిన వారికి స్వచ్చమైన మనసు ఉంటుందని అంటారు. హరిక్రిష్ణ విషయంలో అది నూరు పాళ్ళు నిజం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఆయనకు అలాగే వచ్చింది. తాను నమ్మిన వారు మోసం చేస్తే తిరగ‌బడే తత్వం అక్కడ నుంచే వచ్చింది. ఎవర్ని అయినా వెంటనే నమ్మేసే అమాయకత్వమూ ఆయనదే. ఓ విధంగా చెప్పాలంటే చిన్న పిల్లాడి తత్వం ఆయనది.


చైతన్య రధ సారధి :


అప్పట్లో తెలుగుదేశం పార్టీని స్తాపించిన తారక రాముడు మొత్తం ఏపీని చుట్టేశారు. ఆయన చైతన్య రధానికి సారధి హరిక్రిష్ణ కావడం విశేషం. మొత్తం తొమ్మిది నెలలు అలా అలుపెరగకుండా అన్న గారి వెంట తిరిగిన హరి తండ్రి ముఖ్యమంత్రి అయినా ఏ పదవీ ఆశించకుండా పార్టీలో అతి సామాన్య కార్యకర్తగానే ఉండిపోయారు. మూడు సార్లు నందమూరి  ముఖ్యమంత్రి అయినా హరి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదంటే పదవుల పట్ల ఆయనకు ఎంతటి విరక్తి భావమో అర్ధం చేసుకోవచ్చు.


సినిమాలలోనూ:


ఎంటీయార్ కు సినిమా  తొలి వారసుడు, టాలీవుడ్ స్టార్స్ తొలి వారసుడు కూడా హరిక్రిష్ణే. ఆయన తన పదమూడేళ్ళ వయసులో శ్రీక్రిష్ణావతారం మూవీలో బాలక్రిష్ణుడిగా నటించి మెప్పించారు. అలాగే తలా  పెళ్ళామా చిత్రంలో ఆయన బాల నటుడిగా కనబరచిన నటన ప్రశంశలు పొందింది. ఇక తాతమ్మ కళ సినిమాలోనూ  మంచి పాత్ర వేసిన ఆయన దానవీరశూరకర్ణ సినిమాలో అర్జునుడిగా నటించి మెప్పించారు, అన్న గారికి సైతం ఒప్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: