నందమూరి హరిక్రిష్ణ ఇక లేరు అనే వార్త నందమూరి అభిమానుల్లో విషాదాన్ని నిలుపుతోంది..తండ్రి కి వెన్నంటే ఉంటూ తండ్రి కోసం ఎంతో జీవితాన్ని ధారపోసిన హరికృష్ణ ఈరోజు తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు..హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ సుమారు 30 అడుగుల దూరంలో పడిపోయింది...కారు లో నుంచీ బయటకి పడిపోయిన హరికృష్ణ తలకి తీవ్ర గాయాలు అయ్యాయి..స్థానికులు దగ్గరలోని కామినేని కి తరలించి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది..

 Image result for harikrishna died

హరికృష్ణ మరణంతో యావత్ నందమూరి అభిమానులు ,తెలుగు దేశం కార్యకర్తలు ముఖ్యంగా కుటుంభ సభ్యులు విషాదంలో మునిగిపోయారు..ఇదిలాఉంటే హరికృష్ణ చివరిగా రాసిన ఒక లేఖ ఇప్పుడు నందమూరు కుటుంభ సభ్యులని అభిమానులని మరింత భాద పెడుతోంది..ఆ లేఖని చదివిన వారు ఎవరికైనా సరే భావోద్వేగానికి  లోనవ్వక తప్పదు అంటున్నారు.. సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినం మరో నాలుగు రోజుల్లో ఆయన పుట్టినరోజు జరగనున్న నేపథ్యంలో హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు..ఇంతకీ ఆలేఖలో సారాంశం ఏమిటంటే..

 

“సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను..ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’’  ...అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

 Image result for harikrishna died

హరికృష్ణ మానవత్వానికి ఇది నిదర్శనమని మరో నాలుగు రోజుల్లో పుట్టిన రోజు చేసుకోవాల్సిన హరికృష్ణ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం అభిమానులకి తీరని లోటని కన్నీరు మున్నీరు అవుతున్నారు..మరోవైపు హరికృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: