గత కొంత కాలంగా టీటీడీపై ఎన్నో సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ ప్రధాన అర్చకులు తాజాగా మరోసారి టీటీడీపై  సంచలన వ్యాఖ్యలు చేశారు.  తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తాను దరఖాస్తు చేసుకోకుండా.. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. టీటీడీ తన పేరిట రూ.30 లక్షలు బ్యాంక్ అకౌంట్‌లో వేసిందన్నారు. తనను కక్షపూరితంగా అర్చక బాధ్యతల తొలగించి.. మళ్లీ ఏకపక్షంగా తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేశారని విమర్శించారు. తన అర్చక నిరయామకం వంశపారంపర్యం ప్రకారం జరిగిందంటున్నారు రమణ దీక్షితులు.

సర్వీస్ రూల్స్ ప్రకారం కాదని.. అందుకే 30ఏళ్ల పాటూ అర్చక బాధ్యతల్లో కొనసాగిన తనకు ఎలాంటలి అలవెన్స్‌లు, సర్వీస్‌కు సంబంధించిన ఉత్తర్వులు లేవన్నారు.  ఈ రూ.30 లక్షలు డిపాజిట్ చేశాక ఇవే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తాను అసలు దరఖాస్తే చేయలేని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అనాచారాలను బయటపెట్టినందుకు తనను కక్షపూరితంగా బాధ్యతల నుంచి తొలగించారన్నారు.
Image result for tirupathi
ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, రసీదులు లేకుండా దరఖాస్తు చేయకుండా అధికారులు ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేశారనీ, టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని రమణ దీక్షితులు అన్నారు. ఈ సమస్యను తాను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానని చెప్పారు.ఈ వ్యవహారంతో టీటీడీపై తాను చేస్తున్న విమర్శలు నిజమేననే విషయం తేట తెల్లమవుతుందన్నారు. త్వరలోనే ఈ పరిణామాలన్నిటిపై కోర్టును ఆశ్రయిస్తానన్నారు రమణ దీక్షితులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: