"స్నేహం జీవన గీతానికి పల్లవి - స్నేహం జీవితాలను మోసే పల్లకి"  అనేది నందమూరి హరికృష్ణ మరణం అనంతరం మరోసారి ఋజువైంది. దానికి రాజకీయాలు ఎలాంటి అవరోధాలు సృష్టించలేవు.  జూనియర్ నందమూరి తారక రామారావు, కొడాలి నాని అత్యుత్తమ స్నేహితులని చెప్పవచ్చు. ఆ విషయం అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ప్రాణ  మిత్రుల్లో కొడాలి నాని స్థానం ప్రధమం అది ఎప్పటికి పదిలం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రాజకీయ కారణాల తో కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వదిలేసి వైసీపీలో చేరిన తర్వాత వారిద్దరి మధ్య కొంచెం అంతరం వచ్చిందని అందరూ భావించారు. కానీ అది నూరుపాళ్లు అబద్ధమని, ఆ ప్రచారానికి ఈ రోజు నాని తెరదించారు. 
Related image
విభిన్న అదీ బద్ద శత్రువర్గ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ, ఈ ప్రాణ మిత్రులు క్లిష్ట, కష్ట కాలంలో ఒకరి కొకరు తోడుగానే ఉంటారని నిరూపించారు. హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న కొడాలి నాని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం హైదరాబాద్‌కు భౌతికకాయాన్ని తరలించే సమయంలోనూ ఎన్టీఆర్ వెంటే తోడుగా చివరివరకు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను కౌగిలించుకొని ఓదార్చారు. 
Image result for junior NTR, Kodali Nani, Harikrishna
హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. హరికృష్ణ అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి  హరికృష్ణ అని ఆయన చెప్పారు. తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనేనని, హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కొడాలి నాని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: