ఒక మహానుభావుడు తన భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాడు. ఎలాగోలా విడాకులు ఇచ్చాడు. అందుకు కోర్టు ఆదేశంతో భరణం మాజీ భార్యకు చెల్లించక తప్పలేదు. భరణం మొత్తం ఏకంగా $10500/ (సుమారు ₹ 7,33,586) ఇవ్వాల్సివచ్చింది. 
Image result for alimony paid by dwi susilawati to his wife in indonesia
వారి దాంపత్య జీవితంలో ఏర్పడ్డ విభేదాల తో కక్షగట్టిన అతను ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఆ వ్యక్తి కేసు ట్రయల్ సమయంలో రకరకాల విన్యాసాలు చేశాడు. కాని పగ తీర్చుకోవటానికి భరణం 9ఏళ్లుగా ఇవ్వకుండా పెండింగ్ పెట్టటంతో భరణం మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. తప్పని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని 890 కిలోల బరువైన నాణేల రూపంలో ఇచ్చాడు. ఆయనే ఇండోనేషియాకు చెందిన డ్వి సుసిలార్టో.  దీంతో డ్వి సుసిలార్టో తరఫు లాయర్, అతని మాజీ భార్య హెర్మి సెత్యోవాటి తరఫు లాయర్ మధ్య న్యాయస్థానంలోనే భీకర వాగ్వాదం జరిగింది. అన్ని కాయిన్లను లెక్కబెట్టలేక ఆ లాయర్, డ్వి సుసిలార్టోను కొట్టినంత పనిచేశాడు. 
Image result for alimony paid by dwi susilawati to his wife in indonesia
దానికి సమాధానంగా చిన్న ఉద్యోగం చేసుకొనే డ్వి సుసిలార్టో దగ్గర భరణం చెల్లించేంత డబ్బు లేదు. దీంతో ఆయన స్నేహితుల సహాయం కోరాడు. వాళ్లంతా ఆయనకు ఆ మొత్తం కాయిన్ల రూపంలోనే ఇచ్చారని, అందుకే మరో దారిలేని అతను అదే డబ్బును భరణంగా ఇచ్చినట్లు డ్వి సుసిలార్టో చెప్పినట్లు అతని లాయర్ న్యాయస్థానానికి  వెల్లడించాడు. 
Related image
ఆ నాణేలను చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని, అయితే తన మాజీ భార్యను అవమానించాలన్న ఉద్దేశం తన క్లెంట్‌ కు లేదని ఆ లాయర్ న్యాయస్థానానికి స్పష్టం చేశాడు. దాంతో కోర్టు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఆ నాణేలను లెక్కించే పనిని అప్పగించింది. ఆ డబ్బును తీసుకోవడానికి మొదట్లో అతని మాజీ భార్య సెత్యోవాటి అంగీకరించక పోయినా, తర్వాత వేరే దారిలేక తీసుకోవటానికి అంగీకరించిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: