ముస్లింల మీద చంద్ర‌బాబునాయుడుకు ఎంత‌టి ప్రేముందో  తాజాగా బ‌య‌ట‌ప‌డింది.  త‌న‌కు ముస్లింలంటే ఎంత‌టి ప్రేముందో చాటి చెప్పేందుకు గుంటూరులో మంగ‌ళ‌వారం ' నారా హ‌మారా-టిడిపి హ‌మారా ' అంటూ ఓ స‌ద‌స్సు నిర్వ‌హించారు.  స‌దస్సులో త‌న ప్ర‌భుత్వం ముస్లింల‌కు గడ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల్లో అది చేసింది ఇది చేసిందంటూ గొంతు చించుకుని మ‌రీ అర‌చి చెప్పుకున్నారు.  ప‌నిలో ప‌నిగా వైసిపి, జ‌న‌సేన‌, బిజెపితో పాటు న‌రేంద్ర‌మోడిని కూడా నోటికొచ్చిన‌ట్లు విమ‌ర్శించారు.  ముస్లింల‌ను ఉద్ద‌రించ‌టానికొచ్చిన అభిన‌వ‌ ప్ర‌వ‌క్త‌లాగ బిల్డ‌ప్ ఇచ్చారు. 


ముస్లింల వ్య‌తిరేక నినాదాలు


సీన్ క‌ట్ చేస్తే, ఎనిమిది మంది ముస్లిం యువ‌త‌ను పోలీసులు గ‌డ‌చిన 24 గంట‌లుగా పోలీసు స్టేష‌న్ల చుట్టూ తిప్పుతూ చావ‌గొడుతున్నార‌ట‌. ఇంత‌కీ ముస్లిం యువ‌త‌ను ఎందుకు చావగొడుతున్నారు ? ఎందుకంటే,  నారా హ‌మారా సద‌స్సులో చంద్ర‌బాబు మాట్లాడుతున్న స‌మ‌యంలో కొంత‌మంది ముస్లిం యువ‌కులు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా  ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ముస్లింల సంక్షేమానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏమీ చేయ‌టం లేద‌ని నినాదాలు ఇచ్చారు. వ‌క్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. 


ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించిన యువ‌త‌


ముస్లింల ఓట్లు కొల్లుగొట్టే ఉద్దేశ్యంతో తాను స‌భ నిర్వ‌హిస్తుంటే అదే స‌భ‌లో  అందులోను ముస్లింలే త‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌టం, త‌న‌ను నిల‌దీయ‌టాన్ని చంద్ర‌బాబు స‌హించ‌లేక‌పోయారు. ఇంకేముంది,  వేదిక మీద నుండే చంద్ర‌బాబు పోలీసుల‌ను ఉసిగొలిపారు. ముస్లింలు ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించి నినాదాలు ఇస్తుండ‌గానే పోలీసులు, కొంద‌రు టిడిపి శ్రేణులు ఆ యువ‌కుల‌ను చుట్టుముట్టారు. వాళ్ళ చేతుల్లోని ప్ల కార్డుల‌ను లాగేశారు. అంతేకాకుండా నినాదాలు చేస్తున్న యువ‌కుల‌ను చొక్కాలు ప‌ట్టుకుని స‌ద‌స్సు నుండి బ‌య‌ట‌కు లాక్కుని వెళ్ళారు. అంతే మ‌ళ్ళి ఇప్ప‌టి వ‌ర‌కూ  బ‌య‌ట‌కు వెళ్ళ‌గొట్టిన యువ‌కుల్లో ఎనిమిది మ‌ళ్ళీ ఇంత వ‌ర‌కూ  ఎవ‌రికీ క‌న‌బ‌డ‌లేద‌ట‌. 


పోలీసుల అదుపులోనే యువ‌కులు


వైసిపి నేత‌ల చెబుతున్న ప్ర‌కార‌మైతే ప్ల కార్డులు ప‌ట్టుకుని, నినాదాలు చేసిన ఎనిమిదిమంది యువ‌కుల‌ను పోలీసులు చావ గొట్టార‌ట‌. పైగా ఎవ‌రిమీదా ఎటువంటి కేసులు పెట్ట‌కుండానే  24 గంట‌లుగా చావ‌గొడుతూనే ఉన్నార‌ట‌. వాళ్ళ‌ని గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్టేష‌న్లు చుట్టూ  తిప్పుతున్నార‌ట‌. పోలీసుల అదుపులో ఉన్న యువ‌కులంతా క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన వారట‌. వారిని గుంటూరు జిల్లాలోని న‌ల్ల‌పాడు పోలీసు స్టేష‌న్లో ఉన్న‌పుడు వైసిపి నేత‌లు గుర్తించారు. 


నారా హ‌మారా అంటే అర్ధం ఇదేనా ?


చంద్ర‌బాబుకు నిజంగానే ముస్లింల‌పై అంత‌టి ప్రేమే ఉంటే త‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశార‌ని, ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించార‌ని కొట్టిస్తారా ? 24 గంట‌లుగా వారిని వివిధ పోలీసు స్టేష‌న్ల చుట్టూ తిప్పుతారా ?  చేత‌నైతే యువ‌కుల‌డిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానాలు చెప్పాలి. లేక‌పోతే నినాదాలు చేస్తున్న యువ‌కుల‌ను స‌ద‌స్సులో నుండి బ‌య‌ట‌కు పంపేయాలి. అంతేకానీ కేసులు పెట్ట‌కుండానే వారిని ఇన్ని హింస‌ల‌కు గురిచేయిస్తారా ?  పై స్ధాయి నుండి  ఎటువంటి ఆదేశాలు రాకుండానే పోలీసులు స్వ‌తంత్రించి ఇంత‌టి స‌హాసం చేయ‌గ‌ల‌రా ?  ఇదేనా చంద్ర‌బాబు వారి నారా హ‌మారా-టిడిపి హ‌మారా నినాదానికి అర్ధం ?


మరింత సమాచారం తెలుసుకోండి: