కొన్ని కార్యక్రమాలు కొందరికి కలసి వస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూసినా దక్కని హామీ కొన్ని పరిణామాల వల్ల అలా సులుభంగా నెరవేరిపోతాయి.  విశాఖలో అలా ఓ నాయకునికి తాజా పరిస్థితులు కలసి వస్తున్నాయి. ఆయనకు వచ్చే ఎన్నికలలో టికెట్ ష్యూర్ అంటున్నారు. దాంతో అక్కడ సిట్టింగ్ కి షాక్ తగిలేలా ఉంది.


నారా హామారాతోనే :


నారా హమారా...టీడీపీ హమారా ప్రోగ్రాం తో ఓ నాయకునికి టికెట్ పై ధీమా పెరిగిందని టాక్. ఎపుడో పాతికేళ్ళ క్రితం అన్న గారు టికెట్ ఇస్తే తొలి సారి గెలిచిన ఆయన చంద్రబాబు జమానాలో మాత్రం టిక్కెట్ కి ఇక్కట్లే పడ్డారు. విశాఖ  సిటీకి చెందిన ఎస్ ఎ రహమాన్ 1994లో టీడీపీ తరఫున అప్పటి ఒకటవ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తరువాత 1999, 2004 ఎన్నికలలో బీజేపీతో పొత్తుల భాగంగా టికెట్ దక్కలేదు. 2009, 2014 వచ్చేసరికి వాసుపల్లి గణేష్ కుమార్ కి ఇచ్చారు. ఇలా దశాబ్దాలుగా టికెట్ కోసం పోరాడుతున్న ఆయనకు నారా హమారా తో లైన్ క్లియర్ అయినట్లేనని టాక్ 


ఆ కోటాలో :


విశాఖ దక్షిణంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ రహమాన్ ఓసారి ఎమ్మెల్యేగా చేశారు. అందువల్ల ఆయనకు మరో మారు చాన్స్ తగలనుందని టీడీపీ వర్గాల టాక్. ముస్లిం మైనారిటీ వర్గాలను బాగా దువ్వుతున్న చంద్రబాబు నారా హమారా కార్యక్రమంలో కూడా వీలైనన్ని టిక్కెట్లు ఇస్తానని ప్రామిస్ చేశారు. అలా రహమాన్ జాతకం తిరగనుందని అంటున్నారు. 



అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గణెష్ కుమార్ సంగతేంటన్నది చూడాలి. ఆయంపైన పార్టీలో అసమ్మతి రావడం, పని తీరు పై బాబుకు ఫిర్యాదులు వెళ్ళడంతో చెక్ పెడతారని అంటున్నారు. ఇక రహమాన్ చాలకాలంగా తనకంటూ ఓ బలమైన వర్గాన్ని అక్కడ తయారు చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే పైనే కత్తులు దూస్తూ వస్తున్నారు. రేపటి రోజున రహమాన్ కి టికెట్ దక్కినా సిట్టింగ్ ఎమ్మెల్యే కోపరేషన్ ఎంతవరకూ ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: