ఒకపుడు జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పిన ఆ నాయకుడు గత నాలుగేళ్ళుగా పెద్దగా సందడి చెయడంలేదు. ఈ మధ్య్న మళ్ళీ ప్రజా సమస్యలపై జనంలోకి వస్తున్నా వచ్చే ఎన్నికలలో ఏదో పార్టీని ఎంచుకుని పోటీ చేస్తారని అంటున్నారు. ఇంతవరకూ ఆయన ఆలొచనలైతే బయటపడలేదు. మరి ఏం చేయబోతారన్నది ఇంటెరెస్టింగ్ మ్యాటర్ గా ఉంది.


వైఎస్ కి ఆప్తుడు :


విశాఖ జిల్లా అనకాపల్లి కేంద్రంగా  చేసుకుని రాజకీయాలు నెరపుతున్న మాజీ మంత్రి కొణటాల పొలిటికల్ ఫ్యూచర్ పై ఇపుడు హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఎందుచేతనటే ఆయన ఇలాకాలోనే వైసీపీ అధినేత జగన్ ఉన్నారిపుడు. భారీ మీటింగ్ అనకాపల్లిలో పెట్టిన జగన్ కు జనం నీరాజనాలు పలికారు. వచ్చే ఎన్నికలలో గెలుపు ధీమాతో ఉన్న వైసీపీ జిల్లాలో పార్టీని పటిష్తం చేసుకుంటోంది. మాజీలతో సహా అందరికీ ఇన్విటేషన్లు పంపుతోంది. మరి ఈ టైంలో వైఎస్ కి ఆప్తుడిగా ఉన్న కొణతాల సంగేంటన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది.


ఈయన ఒకేనా :


వైసీపీలో మూడేళ్ళ పాటు పనిచేసిన కొణతాల స్వతహాగా కాంగ్రెస్ వాది. పైగా వైఎస్సార్ కి ఇష్టుడు. ఈ కారణాలతోనే ఆయన వైసీపీ ఏర్పాటు టైంలో ఈ వైపుగా వచ్చి జగన్ కి అండగా నిలబడ్డారు. విశాఖలో విజయమ్మ ఓటమి పాలు కావడంతో జగన్ తో ఏర్ప‌డిన అభిప్రాయభేదాలు ఆయనను పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేసాయి. నాలుగేళ్ళుగా ఏ పార్టీలో చేరని కొణతాల వైసీపీలోకి మళ్ళీ వస్తారని టాక్ నడుస్తోంది. మరి దీనికి సంబంధించి రాయబారాలు ఎలా సాగుతున్నాయన్నది తెలియరావడంలేదు.



పార్టీలో విజయసాయిరెడ్డి లాంటి వారు కొణతాల అవసరాన్ని గుర్తిస్తున్నా అధినేత జగన్ ఎలా  రెస్పాండ్ అవుతారో అంటున్నారు. ప్రస్తుతం అనకాపల్లిలోనే ఉన్న జగన్ ఈ విషయంపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమోనని అంతా చూస్తున్నారు. మళ్ళీ కొణతాల వైసీపీలో చేరితే ఆ పార్టీకి వూపు వచ్చినట్లేనంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: