తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతితో ఆ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగారు. తమ అభిమాన నటుడు..నాయకుడు అనుకోకుండా కన్నుమూయడంతో ఇప్పటికీ కొంత మంది జీర్ణించుకోలేక పోతున్నామని అంటున్నారు.  ఆయన ఎంతో గొప్ప స్థానంలో ఉన్నా స్నేహానికి, అభిమానులకు ఎందుబాటులో ఉంటూ..వారితో సాన్నిహిత్యంగా ఉండేవారని అంటున్నారు.  అయితే నిన్న మొత్తం హరికృష్ణ భౌతిక ఖాయాన్ని సందర్శించేందుకు వీఐపీలు రావడంతో అభిమానులకు, కార్యకర్తలకు చూడటానికి వీలు కాలేదు. 
Image result for హరికృష్ణ అభిమానులు
నేడు ఈ ఉదయం 8 గంటల నుంచి మెహిదీపట్నంలోని ఆయన ఇంటివద్ద బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి, ఓ క్రమ పద్ధతిలో అభిమానులను హరికృష్ణ ఇంటిలోనికి అనుమతిస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, నందమూరి కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో మెహదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. 

ప్రముఖులు, అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసు విభాగం సూచించింది. హరికృష్ణ  మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: