నంద‌మూరి హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. ఫిల్మి న‌గ‌ర్లోని మ‌హాప్ర‌స్ధానంలో సాయంత్రం సుమారు 4 గంట‌ల ప్రాంతంలో హ‌రికృష్ణ చితికి  పెద్ద కుమారుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిప్పు పెట్టారు. ఇంటి నుండి క‌ల్యాణ్ రామ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ తండ్రి భౌతిక‌కాయంతోనే మ‌హాప్రస్ధానం వాహ‌నంలో మ‌హాప్ర‌స్ధానానికి చేరుకున్నారు. మ‌హాప్ర‌స్ధానం వాహ‌నంలో నుండి భౌతిక‌కాయాన్ని చంద్ర‌బాబు, జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్ త‌దిత‌రులు  అత్య‌క్రియ‌ల‌కు ఉద్దేశించిన స్ధ‌లం వ‌ర‌కూ మోసుకుని వ‌చ్చారు. 


అధికారిక లాంఛ‌నాల‌తో


హరికృష్ణ‌ను చివ‌రి సారిగా చూసేందుకు వేలదిమంది అభిమానులు మ‌హాప్ర‌స్ధానం వాహ‌నంతో పాటు న‌డిచారు. అదే విధంగా మ‌హాప్ర‌స్ధానంకు కూడా చేరుకున్నారు.  అంతిమ సంస్కారాల క్ర‌తువు పూర్త‌యిన త‌ర్వాత చితికి క‌ల్యాణ్ రామ్ నిప్పంటించారు.   తెలంగాణా ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో అంత‌క్రియ‌లు పూర్త‌య్యాయి. మ‌హాప్ర‌స్ధానంకు రాజ‌కీయ‌,సినీ రంగాల‌కు చెందిన అనేక మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌వ్వ‌ట‌మే జ‌నాల్లో  నంద‌మూరి కుంటుంబానికున్న ఆధ‌ర‌ణ అర్ద‌మ‌వుతోంది. 


ట్రాఫిక్ ఆంక్ష‌లు


అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి చూసుకోవాల్సిందిగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ శ్రీ‌నివాస‌యాద‌వ్, జ‌గ‌దీష్ రెడ్డి లాంటి మంత్రుల‌కు పుర‌మాయించారు. అదే విధంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న‌గ‌ర పోలీసు క‌మీష‌న‌ర్ త‌దిత‌రులు బందోబ‌స్తు ఏర్పాట్లను ద‌గ్గ‌రుండి మరీ ప‌ర్య‌వేక్షించారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా పూర్తిగా మెహ‌దీప‌ట్నం నుండి ఫిల్మ్ న‌గ‌ర్ మ‌హాప్ర‌స్ధానం వ‌ర‌కూ ట్రాఫిక్ ను మ‌ళ్ళించారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: