జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆయన ఒక్కోసారి ఒక్కోవిధంగా మాట్లాడడంతో నాయకులు విస్తుబోతున్నారు. పరస్పర విరుధ్ధంగా అధినాయకుడు మాట్లాడంతో ఇతర నాయకులకు ఏం పాలుపోవడంలేదు. లేటేస్ట్గా ఆయన షాకింగ్ కామెంట్స్ తో జన సైనికులకు మైండి బ్లాంక్ అయింది. నిన్నా మొన్నటి వరకూ ఒకలా మాట్లాడిన నాయకుడు ఇపుడు వేరే స్వరం ఆలపించడం వెనక ఏమై ఉంటుందని ఆరా తీస్తున్నారు.


ఆ సీటు ముఖ్యం కాదు :


పవన్ రేపో మాపో సీఎం అవుతారని తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని జనసేన నేతలంతా ఎంతో విశ్వాసంతో ఉన్నారు. పవన్ కూడా తన టూర్లలో అదే చెబుతూ వచ్చారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ లో జరిగిన మీటింగులో మాత్రం పాత పవన్ దర్శనమిచ్చారు. టీడీపీతో ఉన్న రోజులలో ఆయన మాట్లాడినట్లుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, అధికారంలోకి వచ్చామా  లేదా అన్నది తాను చూడనంటూ పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ తో అక్కడ నాయకులు షాక్ తిన్నారు. పవన్ ఎందుకిలా మాట్లాడారన్న దానిపై చర్చ సాగుతోంది.


ఇద్దరు నేతల చేరిక :


తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు కందుల దుర్గేష్, పంతం నానజీ ఈ రోజు పవన్ సమక్షంలో  పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జనసేన కొత్త పార్టీ అని, కష్టాలు ఉంటాయని, వాటికి భరించే వారే తన వెంట రావాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకోవలంటే బాగా తిరగాలని చెప్పారు. ఇదిలా ఉండ‌గా మరికొందరు నాయకులు తూర్పు గోదావరి జిల్లా నుంచి జనసేనలో చేరుతారని చెబుతున్నారు. చూదాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: