ఎంటో ఆయన ఈ మధ్య బాగానే అతి చేస్తున్నాడు. తీరు చూస్తుంటే కళ్ళ ముందు నిజాలను అస్సలు పట్టించుకున్నట్లుగా లేడనిపిస్తోంది. ఆయన ఏపీలోనే ఉన్నా పరిస్తితి ఏ మాత్రం అవగాహన చేసుకున్నట్లు లేదు. అందుకే సీరియస్ గానే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. అయితే జనలకు మాత్రం అవి కామెడీను పంచుతున్నాయి. అదీ విషయం.


ఒంటరిగానే విన్నింగట :


ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తెలుసుకోవడానికి ఏ సర్వే అవసరం అక్కరలేదు. సర్పంచ్ సీటుకు పోటీ పెట్టినా ఆ పార్టీని పక్కన పెట్టేసే ఓటర్లు ఉన్నారిక్కడ. కొత్త పార్టీలకు కాస్తో కూస్తో ఆదరణ దక్కుతోందేమో కానీ కాంగ్రెస్ ను మాత్రం గ్రాండ్ ఓల్డ్ పార్టీగానే కాదు. మోసం చేసిన పార్టీగా భావించి సోదిలోకి కూడా లేకుండా చేస్తున్నారు. ఇదీ నడుస్తున్న కధ అయితే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాత్రం దబ్బా కబుర్లు చెబుతున్నారు. ఏపీలో ఒంటి చేత్తో గెలిచేస్తామంటూ గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు.


వాళ్లకే ఓటమి భయమట :


నిజమే నిండా మునిగిన వాడికి చలి ఏంటని, గెలుపు ఓటముల కొలమానాలు ఎపుడో దాటేసిన స్థితి  ఏపీ కాంగ్రెస్ ది అందువల్ల మాకు భయమేంటి అంటున్నారు పెద్దాయన. పోతే టీడీపీ, వైసీపీ భయపడాలి కానీ అని సెటైర్లు  వేస్తున్నారు. నిజమే గెలుపు కోసం అలుపు లేకుండా పరుగులు తీస్తున్న రేసు గుర్రాళ్ళాంటి పార్టీలు టీడెపీ, వైసీపీ. అందువల్ల ఒక్క ఓటు తేడా కొట్టిన వారికీ బీపీ పెరుగుతుంది, గుండె దడా వస్తుంది. అసలు పోటీలోనే లేని కాంగ్రెస్ కి భయం ఎందుకుంటుదంట. పైగా పొత్తుల కోసం తాము అసలు  వెంపర్లాడడం లేదని బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు రఘువీరా.


అక్కడా, ఇక్కడానట :


గెలుపు అలా ఇలా ఉండదు, ఇక చూస్కో మా తడాఖా అంటున్నారు రఘువీరా. అటు డిల్లీలో, ఇటు ఏపీలో కూడా తామే వస్తామని ఢంకా భజాయిస్తున్నారు. ఎపుడైతే రాహులు పీఎం  అవుతారో అప్పటినుంచే ప్రత్యేక  హోదా అమలేనట. మొత్తానికి నోట్లో బూరెలు బాగా వండేస్తున్నారు రఘువీరారెడ్డి. మరీ ఇంత అతి పనికిరాదు పెద్దాయనా అంటూ ఓ వైపు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నా ఎక్కడా తగ్గడంలేదే. అంతా ఒకే కానీ,  రోజుకొకరుగా పార్టీ నుంచి జారిపోతున్న సీనియర్ల ముందు ఈ కధలు చెబితే బాగుండేమో కదా...


మరింత సమాచారం తెలుసుకోండి: